Sivakarthikeyan: సంతోషమైనా, దుఃఖమైనా మీతోనే.. అభిమానులతో శివకార్తికేయన్‌ సందడి

ABN , Publish Date - Mar 15 , 2024 | 11:44 AM

తన అభిమానులతో హీరో శివకార్తికేయన్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పోరూర్‌లోని ఓ కల్యాణమండపంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఎస్కే అభిమానులు హాజరయ్యారు. వారితో ఆయన మాడ్లాడారు. తన కష్టనష్టాలను చెప్పుకునేందుకు తల్లిదండ్రులు లేరని, సంతోషకమైన, దుఃఖమైనా మీతోనే పంచుకుంటానని చెప్పారు. ఆ తర్వాత ఆయన తన అభిమానులతో కలిసి ఫొటోలు దిగారు. వారితో కలిసి విందుభోజనం చేశారు.

Sivakarthikeyan: సంతోషమైనా, దుఃఖమైనా మీతోనే.. అభిమానులతో శివకార్తికేయన్‌ సందడి
Sivakarthikeyan Meets His Fans

తన అభిమానులతో హీరో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పోరూర్‌ (Porur)లోని ఓ కల్యాణమండపంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఎస్కే అభిమానులు హాజరయ్యారు. వారితో ఆయన మాడ్లాడారు. తన కష్టనష్టాలను చెప్పుకునేందుకు తల్లిదండ్రులు లేరని, సంతోషకమైన, దుఃఖమైనా మీతోనే పంచుకుంటానని చెప్పారు. ఆ తర్వాత ఆయన తన అభిమానులతో కలిసి ఫొటోలు దిగారు. వారితో కలిసి విందుభోజనం చేశారు.

కాగా, తమిళ చిత్రపరిశ్రమ (Kollywood)లో ప్రముఖ హీరోగా గుర్తింపుపొందిన శివకార్తికేయన్‌ నటించిన చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో ‘అమరన్‌’ (Amaran) అనే పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అగ్ర నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) నిర్మిస్తున్నారు. అలాగే, ఏఆర్‌.మురుగదాస్‌ (AR Murugadoss) దర్శకత్వంలో కూడా ఆయన ఓ చిత్రం చేస్తున్నారు. రీసెంట్‌గా ఆయన నటించిన ‘అయలాన్’ (Ayalaan) మంచి విజయాన్నే అందుకుంది.


Siva.jpg

శివకార్తికేయన్‌ విషయానికి వస్తే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి.. స్టార్ హీరోగా స్టేటస్‌ని అందుకున్నారు. కోలీవుడ్ నానిగా ఆయనని అందరూ కొనియాడుతుంటారు. హీరోగానే కాకుండా.. నిర్మాతగానూ శివకార్తికేయన్‌ ఈ మధ్య సినిమాలు తీస్తున్నారు. అతి తక్కువ సినిమాలతోనే అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను శివకార్తికేయన్‌ (Hero Sivakarthikeyan) సొంతం చేసుకున్నారు. (#Sivakarthikeyan)


ఇవి కూడా చదవండి:

====================

*Hanuman OTT: ఏందయ్యా ఇది.. ఈ ఊరించడమేంటి? ఇంట్రెస్ట్ పోతోంది..

****************************

*Ritika Singh: తలైవర్‌కు ఎప్పటికీ రుణపడివుంటా..

*******************************

*AM Rathnam: పవన్ కళ్యాణ్‌పై ‘హరిహర వీరమల్లు’ నిర్మాత పోస్ట్ వైరల్

*****************************

*Vishwak Sen: మా సినిమాని కూడా చూసి.. నలుగురు పెద్ద మనుషులు మాట్లాడండి

************************

Updated Date - Mar 15 , 2024 | 11:44 AM