Santhanam: సింగిల్‌గా ఉండేందుకు నేను శింబునా?

ABN , Publish Date - Apr 28 , 2024 | 04:31 PM

ఎల్లవేళలా సింగిల్‌గా ఉండేందుకు నేను ఏమైనా శింబునా? అని హీరో సంతానం అంటున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇంగ నాన్‌దాన్‌ కింగు’. వచ్చే నెల పదో తేదీన విడుదలకానుంది. సంతానం సరసన ప్రియాలయ నటించగా, ఇతర పాత్రల్లో తంబి రామయ్య, వివేక్‌ ప్రసన్న, బాల శరవణన్‌, మునీష్ కాంత్, మారన్‌, శేషు, స్వామినాథన్‌, కూల్‌ సురేష్‌ తదితరులు కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ వదిలారు.

Santhanam: సింగిల్‌గా ఉండేందుకు నేను శింబునా?
Hero Santhanam

ఎల్లవేళలా సింగిల్‌గా ఉండేందుకు నేను ఏమైనా శింబునా? అని హీరో సంతానం (Santhanam) అంటున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇంగ నాన్‌దాన్‌ కింగు’ (Inga Naan Thaan Kingu). వచ్చే నెల పదో తేదీన విడుదలకానుంది. సంతానం సరసన ప్రియాలయ నటించగా, ఇతర పాత్రల్లో తంబి రామయ్య, వివేక్‌ ప్రసన్న, బాల శరవణన్‌, మునీష్ కాంత్, మారన్‌, శేషు, స్వామినాథన్‌, కూల్‌ సురేష్‌ తదితరులు కనిపించనున్నారు. గోపురం ఫిలిమ్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌‌ (Inga Naan Thaan Kingu Trailer)ను తాజాగా మేకర్స్ రిలీజ్‌ చేశారు.

‘నడిగర్‌ సంఘం భవన నిర్మాణం పనులు పూర్తి చేశాకే వివాహం చేసుకుంటానని చెప్పడానికి నేనేమైనా విశాల్‌ (Vishal)నా.? ఎప్పుడూ సింగిల్‌గా సరదాగా తిరిగేందుకు నేనేమైనా శింబు (Simbu)నా’ అంటూ హీరో సంతానం చెప్పే పంచ్‌ డైలాగులు, తంబిరామయ్య (Thambi Ramaiah) కామెడీ టైమింగ్‌ ట్రైలర్‌లో ప్రధానంగా చూపించారు. సినిమా పూర్తిగా హాస్యభరితంగా తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. డి.ఇమ్మాన్‌ నేపథ్య సంగీతం ట్రైలర్‌లో స్పష్టంగా తెలుస్తుంది. ట్రైలర్‌ చివరిలో హీరో యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి.


Santhanam.jpg

ఈ సందర్భంగా సంతానం మాట్లాడుతూ.. మరో మంచి కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఇందులో సరదాకి మాత్రమే కొన్ని డైలాగ్స్ ఉంటాయి తప్పితే.. ఎవరినీ టార్గెట్ చేసి రాసినవి మాత్రం కాదు. ఇందులో తంబిరామయ్య కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, చిత్ర దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Apr 28 , 2024 | 04:31 PM