Santhanam: నొప్పించడానికి కాదు.. నవ్వించేందుకే సినిమాల్లోకి వచ్చా

ABN , Publish Date - Jan 30 , 2024 | 02:07 PM

నవ్వించడానికి మాత్రమే సినిమాల్లోకి వచ్చాననీ, ఏ ఒక్కరినీ నొప్పించడానికి రాలేదని హీరో సంతానం స్పష్టం చేశారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వడకుప్పట్టి రామస్వామి’ చిత్రం టైటిల్‌, పాత్రపై వివాదం నెలకొంది. తాజాగా చెన్నైలో జరిగిన ఈ చిత్ర ఆడియో, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ వివాదానికి సంతానం తెరదించారు.

Santhanam: నొప్పించడానికి కాదు.. నవ్వించేందుకే సినిమాల్లోకి వచ్చా
Santhanam

నవ్వించడానికి మాత్రమే సినిమాల్లోకి వచ్చాననీ, ఏ ఒక్కరినీ నొప్పించడానికి రాలేదని హీరో సంతానం స్పష్టం చేశారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వడకుప్పట్టి రామస్వామి’ చిత్రం టైటిల్‌, పాత్రపై వివాదం నెలకొంది. తాజాగా చెన్నైలో జరిగిన ఈ చిత్ర ఆడియో, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ వివాదానికి సంతానం తెరదించారు.

ఈ కార్యక్రమంలో సంతానం (Santhanam) మాట్లాడుతూ.. ‘డీడీ రిటర్న్స్‌’ కోణంలో మరో హాస్య భరిత చిత్రంలో నటించి, హిట్‌ ఇవ్వాలని ఆశపడ్డా. అలా తెరకెక్కించిందే ఈ సినిమా. ఏ ఒక్కరి మనసును గాయపరిచే సన్నివేశం ఇందులో లేదు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తూ, కడుపుబ్బ నవ్వేలా ఉంటుంది. సీనియర్‌ హాస్య నటుడు గౌండమణి వీరాభిమానిని. ఆయన చిత్రంలో వచ్చిన ఓ డైలాగే ఈ చిత్ర టైటిల్‌. దాన్ని ఆధారంగా చేసుకునే కథను దర్శకుడు డెవలప్‌ చేశాడు. నేను, హీరో ఆర్య కలిసి ఒక చిత్రంలో నటించనున్నాం. అలాగే, ఆర్య నిర్మాణంలో నేనొక చిత్రంలో నటించనున్నా. మా ఇద్దరి గురించి ఇండస్ట్రీలోని ఫైనాన్షియర్లు అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారు. చివరగా బంగారు గుడ్లు పెట్టే ఒక బాతు వద్దకు నన్ను ఆర్య తీసుకెళ్లాడు. కానీ, ఆ బాతు గుడ్లు పెట్టలేదుకదా... మాకే రక్తం వచ్చింది. అది ఎవర్నది సస్పెన్స్‌ అని సంతానం అన్నారు. (Vadakkupatti Ramasamy Pre Release Event)


aarya.jpg

హీరో ఆర్య మాట్లాడుతూ... అభిమానులంటే సంతానంకు పిచ్చి. వారిని ఎల్లపుడూ సంతోషంగా ఉంచేందుకు తన వంతు ప్రయత్నిస్తుంటాడు. కార్తీక్‌ యోగి దర్శకత్వంలో ఓ అడ్వెంచర్‌ ఫాంటసీ కథలో నేను, సంతానం త్వరలో కలిసి నటించనున్నామని తెలిపారు. దర్శకుడు కార్తీకి యోగి మాట్లాడుతూ... ‘డిక్కిలోనా’ చిత్రానికి ప్రేక్షకులు, సంతానం అభిమానులు ఇచ్చిన ఆదరణ వల్లే ఈ చిత్రానికి పునాది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం. నిర్మాత విశ్వప్రసాద్‌కు ధన్యవాదాలు. మళ్లీమళ్లీ సంతానంతోనే నేను సినిమాలు చేస్తానని అన్నారు. కాగా, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానరుపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించగా, సంతానం సరసన మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటించారు. సంగీతం షాన్‌ రోల్డన్‌. ఫిబ్రవరి 2వ తేదీన విడుదలకానుందీ చిత్రం.


ఇవి కూడా చదవండి:

====================

*Raveena Tandon: ఆ వదంతులకు తావు లేదు.. ఇప్పుడే చాలా బావుంది

***************************

*Fighter: హృతిక్ రోషన్ కెరీర్‌లో ఆ ఘనత సాధించిన 14వ చిత్రంగా ‘ఫైటర్’

***************************

Updated Date - Jan 30 , 2024 | 02:07 PM