Santhanam: అనుష్క సరసన నేను హీరోగా.. అంత ఈజీ కాదు

ABN , Publish Date - May 05 , 2024 | 06:32 PM

నిర్మాత అన్బుచెళియన్‌ సమర్పణలో గోపురం ఫిలిమ్స్‌ పతాకంపె సుష్మిత అన్బుచెళియన్‌ నిర్మించిన చిత్రం ‘ఇంగ నాన్‌దాన్‌ కింగు’. ఆనంద్‌ నారాయణ్‌ దర్శకుడు. సంతానం, ప్రియాలయ జంటగా నటించారు. ఈ నెల 10వ తేదీన విడుదల కాబోతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సంతానం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Santhanam: అనుష్క సరసన నేను హీరోగా.. అంత ఈజీ కాదు
Inga Naan Thaan Kingu Pre Release Event

తమిళ చిత్రపరిశ్రమలోని బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన గోపురం ఫిలిమ్స్‌ (Gopuram Films) బ్యానరులో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా నటుడు సంతానం చెప్పుకొచ్చారు. ఈ సంస్థ అధినేత అన్బుచెళియన్‌ తలచుకుంటే ఎంత పెద్ద స్టార్‌ లేదా ఒక అనామకుడితో అయినా సినిమా తీసి ఆడించగలరని, అలాంటి నిర్మాతతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిర్మాత అన్బుచెళియన్‌ సమర్పణలో గోపురం ఫిలిమ్స్‌ పతాకంపె సుష్మిత అన్బుచెళియన్‌ నిర్మించిన చిత్రం ‘ఇంగ నాన్‌దాన్‌ కింగు’ (Inga Naan Thaan Kingu). ఆనంద్‌ నారాయణ్‌ దర్శకుడు. సంతానం (Santhanam), ప్రియాలయ (Priyalaya) జంటగా నటించగా.. తంబి రామయ్య, వివేక్‌ ప్రసన్న బాల శరవణన్‌, మునీష్కాంత్‌, అతుల్‌ మారన్‌, శేషు, స్వామినాథన్‌, కూల్‌ సురేష్‌, మనోబాల ఇతర పాత్రలను పోషించారు. సంగీతం డి.ఇమ్మాన్‌. ఈ నెల 10న ఈ చిత్రం విడుదలకానున్న నేపధ్యంలో తాజాగా చెన్నై నగరంలో ప్రీ రిలీజ్‌ వేడుకను మేకర్స్ నిర్వహించారు. (Inga Naan Thaan Kingu Pre Release Event)

*Getup Srinu: జనసేనకు ప్రచారం చేయమని ఎవరూ అడగలేదు.. అభిమానంతో వెళ్లాం


Priyalaya.jpg

ఈ కార్యక్రమంలో హీరో సంతానం మాట్లాడుతూ.. ‘‘రజినీకాంత్‌ (Rajinikanth) సినిమాలోని ఓ డైలాగ్‌ను ఈ సినిమాకు టైటిల్‌గా పెట్టాం. అంతకుమించి నిగూఢార్థం ఇందులో లేదు. ‘వడకపట్టి రామస్వామి’ వంటి హిట్‌ చిత్రం తర్వాత గోపురం ఫిలిమ్స్‌ బ్యానరులో నటించడం ఆనందంగా ఉంది. ఈ బ్యానరులో, నిర్మాత అన్బుచెళియన్‌ వద్ద పనిచేయాలని పెద్ద హీరో నుంచి చిన్న నటీనటుల వరకు కోరుకుంటారు. అలాంటి అవకాశం నాకు వచ్చింది. పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. రాజకీయాల్లోకి రావాలన్న ఆశ లేదు. హీరోయిన్‌ అనుష్క (Anushka)తో కలిసి గతంలో కొన్ని చిత్రాల్లో పనిచేశాను. ఆమె సరసన హీరోగా నటించాలంటే సరైన కథ లభించాలి. మీడియా ప్రశ్నలు అడిగినంత ఈజీ కాదు ఏదైనా నెరవేరాలంటే. ఏదో ఒక వివాదాస్పద ప్రశ్న వేసి నన్ను ఇరుకున పెట్టి, వివాదంలోకి లాగాలన్న కోణంలోనే మీరు ఆలోచన చేస్తుంటారా? అంటూ హీరో సంతానం మీడియాను ప్రశ్నించారు. ఆ తర్వాత హీరోయిన్‌ ప్రియాలయ, నిర్మాతలు అన్బుచెళియన్‌, సుష్మిత అన్చుచెళియన్‌, దర్శకుడు ఆనంద్‌ తదితరులు ప్రసంగించారు.

Read Latest Cinema News

Updated Date - May 05 , 2024 | 06:32 PM