R Parthiban: వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోన్న నటుడు

ABN , Publish Date - Apr 09 , 2024 | 06:41 PM

తమిళ చిత్రపరిశ్రమలో వైవిద్యభరితమైన చిత్రాలను తెరకెక్కించడంలో దర్శక నిర్మాత, నటుడు పార్తిబన్‌ ఒకరు. గతంలో ఆయన ఒకే ఒక నటుడుతో ‘ఒత్త చెరుప్పు’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత ‘ఇరవిన్‌ నిళల్‌’ పేరుతో నాన్‌ లీనియర్‌ పేరుతో సింగిల్‌ షాట్‌ మూవీని రూపొందించారు. ఇపుడు 13 మంది టీనేజ్‌ పిల్లలతో ఆయన తెరకెక్కించిన చిత్రం ‘టీన్స్‌’. ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ లాంచ్‌ వేడుక తాజాగా చెన్నై నగరంలో జరిగింది.

R Parthiban: వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోన్న నటుడు
R Parthiban Teenz Audio Launch Event

తమిళ చిత్రపరిశ్రమలో వైవిద్యభరితమైన చిత్రాలను తెరకెక్కించడంలో దర్శక నిర్మాత, నటుడు పార్తిబన్‌ (R Parthiban) ఒకరు. గతంలో ఆయన ఒకే ఒక నటుడుతో ‘ఒత్త చెరుప్పు’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత ‘ఇరవిన్‌ నిళల్‌’ పేరుతో నాన్‌ లీనియర్‌ పేరుతో సింగిల్‌ షాట్‌ మూవీని రూపొందించారు. ఈ రెండు చిత్రాలు ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలతో అవార్డులను సైతం అందుకున్నాయి. ఇపుడు 13 మంది టీనేజ్‌ పిల్లలతో కలిసి ఆయన తెరకెక్కించిన చిత్రం ‘టీన్స్‌’ (Teenz Movie). ఇమ్మాన్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ లాంచ్‌ వేడుక తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ ప్రముఖులు భాగ్యరాజ్‌, కేఎస్‌ రవికుమార్‌, పేరరసు, చరణ్‌, విరుమాండి, వనితా విజయకుమార్‌, రోబో శంకర్‌, యోగిబాబు, పుగళ్‌ తదితరులు హాజరయ్యారు. (Teenz Movie Audio Launch)

*Aalakaalam: మద్యపానంపై వైవిధ్యభరితంగా ‘ఆలకాలం’.. పాజిటివ్ టాక్


ఇందులో నటుడు భాగ్యరాజ్‌ మాట్లాడుతూ... నాకు మంచి అసిస్టెంట్‌ దర్శకులు లభించారు. అందుకే నేను భాగ్యరాజ్‌ అయ్యాను. పార్తిబన్‌ విభిన్నమైన ఆలోచనా ధోరణి నాకు బాగా నచ్చుతుంది. నా వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే సమయంలోనే ఏదో కొత్తగా చేయాలని అనుకునేవారు. ఇపుడు ఆ విధంగానే వైవిధ్యభరితమైన చిత్రాలను నిర్మిస్తున్నారని, అతనిని చూస్తే గర్వంగా ఉందని అన్నారు. (Teenz Movie Trailer Launch)


Teenz.jpg

దర్శకుడు కే.ఎస్.రవికుమార్‌ (KS Ravi Kumar) మాట్లాడుతూ... కొత్తదనానికి పార్తిబన్‌ చిరునామాగా మారారు. ఇమ్మాన్‌ బాల్యం నుంచే సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడిగా అవతరించడానికి కారణం ఆయన కృషే అన్నారు. దర్శకుడు పేరరసు (Perarasu) మాట్లాడుతూ... పార్తిబన్‌ అనుకునివుంటే కమర్షియల్‌ యాక్షన్‌ హీరోగా మారివుండొచ్చు. కానీ, సరికొత్త కథాంశాలను ఎన్నుకుంటూ వైవిధ్యభరితంగా సినిమాలను తెరకెక్కించడంలో ఆయనకు అమితమైన ఆసక్తి ఉంది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుంది. హిట్‌ చిత్రాల కంటే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించి, ప్రతినోటా చర్చించుకునే చిత్రాలను నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఆర్‌.పార్తిబన్‌ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో యోగిబాబు సహా మరికొందరు ప్రధాన తారాగణం నటించారు. శ్రేయా ఘోషల్‌, శ్రుతిహాసన్‌, నిత్యశ్రీ, తిరుకురల్‌ అరివు నేపథ్యగానం చేయగా, డి.ఇమ్మాన్‌ సంగీతం అందించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

****************************

*Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!

***********************

Updated Date - Apr 09 , 2024 | 06:41 PM