Never Escape: హాలీవుడ్‌ చిత్రాలకు దీటుగా రాబోతోన్న హర్రర్‌ మిస్టరీ చిత్రం

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:11 PM

రాయల్‌ బి ప్రొడక్షన్స్‌ పతాకంపై నాన్సీ ఫ్లోరా నిర్మాణంలో శ్రీ అరవింద్‌ దేవ్‌ రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెవర్‌ ఎస్కేప్‌’. రాబర్ట్‌ మాస్టర్‌, ఆది పృథ్వీ, హర్షిణి, కవి జె.సుందరం, ఉవైసి ఖాన్‌, రాజి, అఖిల సుందర్‌, జెబిన్‌ జాన్‌, ప్రాణేశ్వర్‌ తదితరులు నటించారు. సంగీతం చరణ్‌కుమార్‌. త్వరలోనే విడుదలకానున్న ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను లాంచ్ కార్యక్రమాన్ని తాజాగా చెన్నై నగరంలో నిర్వహించారు.

Never Escape: హాలీవుడ్‌ చిత్రాలకు దీటుగా రాబోతోన్న హర్రర్‌ మిస్టరీ చిత్రం
Never Escape Audio Launch Event

రాయల్‌ బి ప్రొడక్షన్స్‌ పతాకంపై నాన్సీ ఫ్లోరా నిర్మాణంలో శ్రీ అరవింద్‌ దేవ్‌ రాజ్‌ (Sri Aravindh Dev Raj) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెవర్‌ ఎస్కేప్‌’ (Never Escape). రాబర్ట్‌ మాస్టర్‌ (Robert Master), ఆది పృథ్వీ, హర్షిణి, కవి జె.సుందరం, ఉవైసి ఖాన్‌, రాజి, అఖిల సుందర్‌, జెబిన్‌ జాన్‌, ప్రాణేశ్వర్‌ తదితరులు నటించారు. సంగీతం చరణ్‌కుమార్‌. త్వరలోనే విడుదలకానున్న ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను లాంచ్ కార్యక్రమాన్ని తాజాగా చెన్నై నగరంలో నిర్వహించారు.

*Sundar C: నా జీవితం, కెరీర్‌లో ముఖ్యమైన చిత్రం ‘అరణ్మనై’..


ఈ కార్యక్రమంలో నిర్మాత ఆల్బర్ట్‌ మాట్లాడుతూ... చిత్రపరిశ్రమకు ఇప్పుడే పరిచయమవుతున్నా. ఈ సినిమా ప్రారంభించే సమయంలో మా అందరి వయసు 25 యేళ్లు. కానీ, 50 యేళ్ల అనుభవం ఉన్నవారిలా ఈ ప్రాజెక్టు కోసం పనిచేశాం. ఈ సినిమాను దర్శకుడు వైవిధ్యభరితంగా రూపొందించారు. రాబర్ట్‌ మాస్టర్‌ బాగా నటించారు. ఇందులో హర్రర్, సైకో, మిస్టరీ ఈ మూడు అంశాలు కలిసి ఉంటాయని పేర్కొన్నారు. దర్శకుడు అరవింద్‌ రాజ్‌ మాట్లాడుతూ... దర్శకుడిగా నాకు తొలి చిత్రమిది. నిర్మాతకు రుణపడి ఉంటా. స్ర్కిప్టు సిద్ధం చేసుకుని అనేక మందిని సంప్రదించా. చివరకు రాబర్ట్‌ ముందుకు వచ్చారు. గతంలో వచ్చిన చిత్రాలకంటే భిన్నంగా ఉంటుందని వివరించారు. (Never Escape Audio Launch)


Never-Escape.jpg

హీరో రాబర్ట్‌ మాస్టర్‌ (Robert Master) మాట్లాడుతూ... కథ విన్న తర్వాత డైరెక్టర్‌ ఎవరని అడిగా. ఎందుకంటే అరవింద్‌ నాకు దర్శకుడిగా కనిపించలేదు. స్టోరీ ఎంతగానో నచ్చింది. కొన్ని సన్నివేశాల్లో గుండు చేయించుకోవాలని సూచించారు. అప్పటికే ఒక చిత్రంలో కమిట్‌ కావడంతో ఆ చిత్ర దర్శకుడి వద్ద పర్మిషన్‌ తీసుకుని గుండు చేసుకున్నాను. మంచి జట్టుతో పనిచేశా. ఇందులో నన్ను వైవిధ్యభరితమైన పాత్రలో చూస్తారు. కొన్ని హాలీవుడ్‌ చిత్రాలకు దీటుగా హర్రర్‌ మిస్టరీ కలిసిన మూవీగా ‘నెవర్‌ ఎస్కేప్‌’ ఉంటుంది’ అన్నారు. అలాగే.. నటి హర్షిణి, నటుడు ఉసైన్‌ ఖాన్‌, నటుడు పృథ్వి, సంగీత దర్శకుడు చరణ్‌ కుమార్‌ తదితరులు ప్రసంగించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Chiranjeevi: జారిపడినా డ్యాన్స్ ఆపలేదు, నాగపాములా ఆడుతూనే ఉన్నా! అప్పుడు మహానటి ఏమన్నారంటే?

**************************

*Natti Kumar: వలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి వర్క్ చేయండి.. సజ్జలకు ఆ రైట్ లేదు

***********************

*Saranya: సీనియర్ నటి శరణ్యపై పోలీసులకు ఫిర్యాదు

***************************

Updated Date - Apr 03 , 2024 | 02:11 PM