40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇళయరాజాను పరామర్శించిన మోహన్ బాబు

ABN, Publish Date - Jan 30 , 2024 | 08:22 PM

లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) కుమార్తె భవతారిణి (47) (Bhavatharini) క్యాన్సర్‌తో గురువారం (జనవరి 25) మృతిచెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న భవతారిణి శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. కుమార్తెను పోగొట్టుకుని తీవ్ర దు:ఖంలో ఉన్న ఇళయరాజాను మంచు మోహన్ బాబు పరామర్శించారు.

Mohan Babu Convey Deepest Condolences to Ilaiyaraaja

లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) కుమార్తె భవతారిణి (47) (Bhavatharini) క్యాన్సర్‌తో గురువారం (జనవరి 25) మృతిచెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న భవతారిణి శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. దీంతో ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కుమార్తెని కోల్పోయి.. బాధలో ఉన్న ఇళయరాజాను పలువురు ప్రముఖులు పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నుండి మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) తన భార్యతో కలిసి ఇళయరాజాను పరామర్శించారు.

ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఇళయరాజాను పరామర్శించిన విషయాన్ని, ఆయనతో ఉన్న ఫొటోలను మోహన్ బాబు షేర్ చేసుకున్నారు. ‘‘ఇళయరాజాగారి ఇంటిలో జరిగిన హృదయ విదారక వార్త గురించి తెలిసింది. ఇళయరాజాగారిని పరామర్శించి, ఆయన కుమార్తె భవతారిణిని కోల్పోయినందుకు ఆయనకు మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయటమైనది. ఈ విషాద క్షణాన్ని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను’’ అని మోహన్ బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.


మోహన్ బాబు చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు కూడా ‘ఓం శాంతి’ అంటూ భవతారిణికి నివాళులు అర్పిస్తున్నారు. భవతారిణి విషయానికి వస్తే.. తన తండ్రిలానే ఆమె కూడా సంగీత దర్శకురాలిగా, గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు. గాయనిగా తమిళ, తెలుగు, మళయాళం, కన్నడ, హిందీలో భాషలలో ఎన్నో పాటలు పాడారు. తెలుగులో ‘గుండెల్లో గోదారి’ సినిమాలో భవతారిణి పాడిన ‘నను నీతో నిను నాతో కలిపింది గోదారి’ పాట మంచి ఆదరణను పొందింది. భారతి మూవీలోని ‘మయిల్‌ పోలా పొన్ను పొన్ను ఒన్ను’ పాటకు భవతారిణి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును పొందారు.


ఇవి కూడా చదవండి:

====================

*పద్మశ్రీ గ్రహీతలను సత్కరించిన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి

*****************************

*Pushpa2: అమ్మవారి గెటప్‌లో అల్లు అర్జున్ ఫొటో లీక్.. సుకుమార్ ఫైర్

***********************

*Santhanam: నొప్పించడానికి కాదు.. నవ్వించేందుకే సినిమాల్లోకి వచ్చా

************************

Updated Date - Jan 30 , 2024 | 08:22 PM