మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Goundamani: 8 గంటలు ఏకధాటిగా డబ్బింగ్‌ చెప్పిన సీనియర్ నటుడు

ABN, Publish Date - Mar 20 , 2024 | 12:27 PM

తాను ప్రధాన పాత్రను పోషించిన తాజా చిత్రం ‘ఒత్త ఓటు ముత్తయ్య’ కోసం సీనియర్‌ నటుడు గౌండమణి ఏకంగా 8 గంటల పాటు డబ్బింగ్‌ చెప్పారు. సినీ క్రాఫ్ట్‌ ఫిలిమ్స్‌ నిర్మాణంలో సాయి రాజగోపాల్‌ కథను సమకూర్చి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కామెడీ కింగ్‌ గౌండమణి హీరోగా నటించారు. పొలిటికల్‌ సెటైర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ నిర్మాణ పనులను జోరుగా జరుపుకుంటోంది.

Goundamani

తాను ప్రధాన పాత్రను పోషించిన తాజా చిత్రం ‘ఒత్త ఓటు ముత్తయ్య’ (Otha Votu Muthaiya) కోసం సీనియర్‌ నటుడు గౌండమణి (Goundamani) ఏకంగా 8 గంటల పాటు డబ్బింగ్‌ (8 Hours Dubbing) చెప్పారు. సినీ క్రాఫ్ట్‌ ఫిలిమ్స్‌ నిర్మాణంలో సాయి రాజగోపాల్‌ కథను సమకూర్చి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కామెడీ కింగ్‌ గౌండమణి హీరోగా నటించారు. పొలిటికల్‌ సెటైర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ నిర్మాణ పనులను జోరుగా జరుపుకుంటోంది. స్థానిక వడపళనిలోని భరణి స్టూడియో (Bharani Studio)లో ఈ సినిమా డబ్బింగ్‌ పనులు సాగుతున్నాయి. సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించే పాత్రలో గౌండమణి పోషించారు.


హీరో స్నేహితుడి పాత్రను యోగిబాబు (Yogi Babu) పోషించారు. వీరిద్దరి మధ్య టైమింగ్‌, కెమిస్ట్రీ బాగా కుదిరిందని, వీరిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా ఉంటాయని దర్శకుడు సాయి రాజగోపాల్‌ (Sai Raja Gopal) చెప్పారు. ఇందులో దర్శకుడు కూడా ఓ ముఖ్య పాత్రను పోషించడం గమనార్హం. ముఖ్యంగా గౌండమణి - యోగిబాబు కాంబినేషన్‌పైనే కోలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో చూసి ఆనందించేలా ఈ సినిమా ఉంటుందన్నారు. గౌండమణి సరసన రాజేశ్వరి (Rajeswari) హీరోయిన్‌గా నటించగా.. ఇతర పాత్రలలో వాసన్‌ కార్తీక్‌, గజేష్‌, అన్బు మైల్‌స్వామి, సింగముత్తు, మొట్టై రాజేంద్రన్‌, రవి మారియా, వయ్యాపురి, డాక్టర్‌ గాయత్రి, కూల్‌ సురేష్‌ తదితరులు నటించారు.


ఇవి కూడా చదవండి:

====================

*RC16: ఘనంగా ‘RC16’ ప్రారంభం.. ఫొటోలు వైరల్

********************************

*Ashwatthama: ‘హనుమాన్’ వంటి మరో చిరంజీవి కథ.. హీరో ఎవరంటే?

***************************

*Thupparivalan 2: హీరో విశాల్‌ సంచలన నిర్ణయం!

*************************

*Kanguva: రూత్ లెస్, ఫెరోషియస్ ఫైట్ టీజర్‌.. చూడాల్సిందే

************************

Updated Date - Mar 20 , 2024 | 12:27 PM