Thupparivalan 2: హీరో విశాల్‌ సంచలన నిర్ణయం!

ABN , Publish Date - Mar 20 , 2024 | 09:55 AM

హీరో విశాల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు హీరోగా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్న విశాల్.. ఇప్పుడో సినిమా కోసం మెగాఫోన్‌ పట్టనున్నారు. ఆయన నటించిన ‘తుప్పరివాలన్‌’కు త్వరలో సీక్వెల్‌ రానుంది. ఈ చిత్రానికి విశాల్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా లొకేషన్ల ఎంపిక కోసం లండన్‌, అజర్‌బైజాన్‌ తదితర ప్రాంతాలకు వెళుతున్నట్టు విశాల్‌ తన ఎక్స్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

Thupparivalan 2: హీరో విశాల్‌ సంచలన నిర్ణయం!
Hero Vishal

హీరో విశాల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు హీరోగా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్న విశాల్ (Hero Vishal).. ఇప్పుడో సినిమా కోసం మెగాఫోన్‌ పట్టనున్నారు. ఆయన నటించిన ‘తుప్పరివాలన్‌’కు త్వరలో సీక్వెల్‌ (Thupparivalan 2) రానుంది. ఈ చిత్రానికి విశాల్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా లొకేషన్ల ఎంపిక కోసం లండన్‌, అజర్‌బైజాన్‌ తదితర ప్రాంతాలకు వెళుతున్నట్టు విశాల్‌ తన ఎక్స్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ (Action King Arjun) వద్ద అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేసిన విశాల్‌... 2004లో వచ్చిన ‘చెల్లమే’ చిత్రం ద్వారా హీరోగా అవతారమెత్తారు. తాను హీరోగా నటించిన తొలి చిత్రమే బ్రేక్‌ ఇవ్వడంతో వరుసగా నటించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 2005లో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘సండైకోళి’తో యాక్షన్‌ హీరోగా మారారు. ఇది ఆయన కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌. ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఈ నేపథ్యంలో తన ఎక్స్‌ ఖాతాలో విశాల్‌ ఒక పోస్ట్‌ చేశారు.

‘‘25 యేళ్ల సినీ ప్రయాణంలో నా లక్ష్యం, నా కల, జీవితంలో నేను ఏం కావాలని కోరుకున్నానో అది కార్యరూపం దాల్చనుంది. త్వరలోనే ఒక కొత్త బాధ్యతలను చేపట్టనున్నా. నా జీవితంలో చాలెంజ్‌తో కూడుకున్న డెబ్యూ డైరెక్టర్‌గా మారనున్నా. ‘తుప్పరివాలన్‌-2’ (Thupparivalan 2)కి దర్శకత్వం వహిస్తున్నా. ఈ విషయాన్ని వెల్లడించేందుకు పదాలు లేవు. నా తండ్రి జీకే రెడ్డి, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కష్టం ఎన్నటికీ వృధా కాదు. ఒక దర్శకుడిగా నా కలను ముందుకు సాగేలా ప్రోత్సహించిన దర్శకుడు మిష్కిన్‌కు ధన్యవాదాలు. రియల్‌ లైఫ్‌లోనూ, రీల్‌ లైఫ్‌లోనూ నన్ను నమ్ముకున్నవారి చెయ్యి వదిలిపెట్టలేదు. దేవుడి ఆశీర్వాదబలంతో లక్ష్యాన్ని చేరుకుంటా’’ అని పేర్కొన్నారు. (Hero Vishal Turns Director)


Vishal-2.jpg

అయితే ‘తుప్పరివాలన్‌-2’ విషయంలో దర్శకుడు మిష్కిన్‌కు, హీరో విశాల్‌కు మధ్య విభేదాలు తలెత్తాయనే విషయం తెలిసిందే. అందుకే.. ఎప్పుడో సెట్స్‌పైకి రావాల్సిన ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించలేనని.. దర్శకుడు మిష్కిన్ కూడా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అందుకే డైరెక్ట్‌గా విశాలే ఆ బాధ్యతలను తీసుకోబోతున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Kanguva: రూత్ లెస్, ఫెరోషియస్ ఫైట్ టీజర్‌.. చూడాల్సిందే

************************

*Ustaad Bhagat Singh: ‘భగత్స్ బ్లేజ్’.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం

********************

*Kaliyugam Pattanamlo: ఏ యుగంలోనూ తల్లిని చంపే రాక్షసుడు పుట్టలేదు.. ట్రెండింగ్‌లో ట్రైలర్

******************

Updated Date - Mar 20 , 2024 | 09:55 AM