Kanguva: రూత్ లెస్, ఫెరోషియస్ ఫైట్ టీజర్‌.. చూడాల్సిందే

ABN , Publish Date - Mar 19 , 2024 | 09:43 PM

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ మూవీ ‘కంగువ’ టీజర్ రిలీజైంది. ఈ టీజర్ విజువల్ వండర్‌గా ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తోంది. కంగువ పాత్రలో సూర్య పోరాట యోధుడిగా కనిపించి ఆకట్టుకుంటున్నారు. పులితో సూర్య చేసిన ఫైట్ సీక్వెన్స్ స్క్రీన్ మీదే చూడాలని అనిపించేలా ఉంది. హార్స్ ఫైటింగ్, బిగ్ షిప్ వార్ సీన్స్‌తో వరల్డ్ సినిమా హిస్టరీలోని ఎపిక్ వార్ మూవీస్‌ను ‘కంగువ’ టీజర్ గుర్తు చేస్తోంది.

Kanguva: రూత్ లెస్, ఫెరోషియస్ ఫైట్ టీజర్‌.. చూడాల్సిందే
Kanguva Movie Still

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ మూవీ ‘కంగువ’ (Kanguva) టీజర్ రిలీజైంది. ఈ టీజర్ విజువల్ వండర్‌గా ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తోంది. కంగువ పాత్రలో సూర్య పోరాట యోధుడిగా కనిపించి ఆకట్టుకుంటున్నారు. పులితో సూర్య చేసిన ఫైట్ సీక్వెన్స్ స్క్రీన్ మీదే చూడాలని అనిపించేలా ఉంది. హార్స్ ఫైటింగ్, బిగ్ షిప్ వార్ సీన్స్‌తో వరల్డ్ సినిమా హిస్టరీలోని ఎపిక్ వార్ మూవీస్‌ను ‘కంగువ’ టీజర్ గుర్తు చేస్తోంది. (Kanguva Teaser Out)

హై క్వాలిటీ విజువల్స్‌తో పాటు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. ఈ టీజర్‌ను మరింత ఎలివేట్ చేసింది. ఉధిరన్‌తో కంగువ చేసిన రూత్ లెస్, ఫెరోషియస్ ఫైట్ టీజర్‌లో హైలైట్ అనేలా ఉంది. ఈ సినిమా కోసం హీరో సూర్య పడిన శ్రమంతా ఆయన మేకోవర్, క్యారెక్టర్‌లో రిఫ్లెక్ట్ అయ్యింది. ఈ సినిమాను భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ (Director Siva) రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Kanguva.jpg

‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. (Kanguva Teaser Talk)


ఇవి కూడా చదవండి:

====================

*Ustaad Bhagat Singh: ‘భగత్స్ బ్లేజ్’.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం

********************

*Kaliyugam Pattanamlo: ఏ యుగంలోనూ తల్లిని చంపే రాక్షసుడు పుట్టలేదు.. ట్రెండింగ్‌లో ట్రైలర్

******************

Updated Date - Mar 19 , 2024 | 09:43 PM