Raashii Khanna: హర్రర్‌ చిత్రాల్లో నటించడం ఈజీ..

ABN , Publish Date - Jun 02 , 2024 | 02:02 PM

హర్రర్‌ చిత్రాల్లో నటించడం సులభమని, కానీ దర్శకత్వం వహించడం చాలా కష్టమని హీరోయిన్‌ రాశీఖన్నా అన్నారు. ఇటీవల సుందర్‌ సి దర్శకత్వంలో వచ్చిన ‘అరణ్మనై-4’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కోలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలవడమే కాకుండా.. రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించిన సందర్భంగా రాశీ ఖన్నా తన ఆనందాన్ని పంచుకున్నారు.

Raashii Khanna: హర్రర్‌ చిత్రాల్లో నటించడం ఈజీ..
Raashii Khanna

హర్రర్‌ చిత్రాల్లో నటించడం సులభమని, కానీ దర్శకత్వం వహించడం చాలా కష్టమని హీరోయిన్‌ రాశీఖన్నా అన్నారు. ఇటీవల సుందర్‌ సి దర్శకత్వంలో వచ్చిన ‘అరణ్మనై-4’ (Aranmanai 4) చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌ (Kollywood)లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలవడమే కాకుండా.. రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించిన సందర్భంగా రాశీ ఖన్నా (Heroine Raashii Khanna) తన ఆనందాన్ని పంచుకున్నారు.

Also Read- Anjali: బాలయ్య నన్ను ఎందుకు నెట్టారో నాకు తెలుసు.. అనవసరంగా పెద్దది చేశారు


రాశీ ఖన్నా (Raashii Khanna) మాట్లాడుతూ... ‘‘గతంతో నేను తమిళంలో నటించిన ‘తిరుచిట్రాంబలం’, ‘సర్దార్‌’ వంటి చిత్రాలు హిట్‌ అయ్యాయి. ఇపుడు ‘అరణ్మనై-4’ కూడా విజయవంతంగా నిలిచింది. నాకు హ్యాట్రిక్‌ (Hat-trick). చిన్నప్పటి నుంచి హర్రర్‌ చిత్రాలంటే అమితమైన ఇష్టం. అలాంటిది ‘అరణ్మనై-4’లో అవకాశం రావడం సంతోషంగా ఉంది. నిజానికి ఈ తరహా చిత్రాల్లో నటించడం సులభం. దర్శకత్వం వహించడమే కష్టం. భాషను అర్థం చేసుకుంటే ప్రేక్షకుల చెంతకు చేరుకోవచ్చు. హిందీలో మాట్లాడుతూ పెరిగిన నాకు... అది కంఫర్టబుల్‌ లాంగ్వేజ్‌ అయినప్పటికీ నటనకు అడ్డంకిగా లేదు. ఇపుడు తమిళం, తెలుగు అర్థం చేసుకుని మాట్లాడగలను. అదే సమయంలో సినీ ఇండస్ట్రీలో వేతన వివక్ష ఉంది. కాలక్రమంలో ఇది మారుతుందని భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు.


Raashii.jpg

ప్రస్తుతం రాశీ ఖన్నా కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ (Tollywood), బాలీవుడ్‌ (Bollywood)లోనూ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. హిందీలో రెండు చిత్రాలు చేస్తున్న రాశీ ఖన్నా.. తెలుగు, తమిళ్‌లో ఒక్కో చిత్రం చేస్తూ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన తాజా, గ్లామర్ ఫొటోలను వదులుతూ.. నిత్యం నెటిజన్లకు టచ్‌లోనే ఉంటోంది.

Read Latest Cinema News

Updated Date - Jun 02 , 2024 | 02:15 PM