RaashiKhanna: షాకింగ్ పోజులో రాశి ఖన్నా, తమన్నా ఏమందో తెలుసా...

ABN , First Publish Date - 2023-06-19T15:13:07+05:30 IST

ఈమధ్య చాలామంది నటీమణులు సాంఘీక మాధ్యమాల్లో తెగ గ్లామర్ ఫోటోస్ పెడుతున్నారు. ఇప్పుడు రాశి ఖన్నా అదే కోవలో రెడ్ డ్రెస్ వున్న గ్లామర్ ఫోటోస్ పెట్టి సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతూ వుంది.

RaashiKhanna: షాకింగ్ పోజులో రాశి ఖన్నా, తమన్నా ఏమందో తెలుసా...
Raashii Khanna

సాంఘీక మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించే నటీమణుల్లో రాశి ఖన్నా (RaashiiKhanna) కూడా వుంది. ఈమధ్య ఈ భామ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. అందులోకి చాలా ఘాటుగా కనపడే ఫోజుల్లో అయితే మరీ కనిపిస్తోంది రాశి ఖన్నా. రెండు మూడు సినిమాలతో బిజీ గా వున్నా, ఇప్పుడు తెలుగు సినిమా మాత్రం ఏదీ చెయ్యడం లేదు, తమిళ సినిమాలు మాత్రం రెండు చేస్తోంది. అయితే ఎలాగు ఆ తమిళ సినిమాలు తెలుగులో అనువాదం చేసి విడుదల చేస్తారు కదా అని ఆమె తమిళ సినిమా ఒప్పుకొని ఉండవచ్చు అని భావిస్తున్నారు.

raashikhanna3.jpg

అలాగే హిందీ సినిమా కూడా ఒకటి చేస్తోంది, అది కూడా సిద్ధార్థ్ మల్హోత్రా (SiddharthMalhotra) పక్కన. కరణ్ జోహార్ (KaranJohar) ఈ సినిమాకి నిర్మాత. ఇదిలా ఉంటే ఆమధ్య ఒక వెబ్ సిరీస్ 'ఫర్జీ' (Farzee) లో చేసి మంచి పేరే తెచ్చుకుంది. అందులో షాహిద్ కపూర్ (ShahidKapoor) కి ప్రియురాలిగా, అలాగే ఏజెంట్ గా ఇలా రెండు పాత్రల్లో బాగా నటించి మెప్పించింది.

raashikhanna4.jpg

రాశిఖన్నా ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆమె ఈరోజు రెడ్ అవుట్ ఫిట్ లో గ్లామర్ పోజు ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఆమె పోజు చూసి కామెంట్స్ చేసిన వాళ్లలో ప్రముఖ నటీమణులు తమన్నా(TamannahBhatia), రెజీనా కెసెండ్రా (ReginaCassandra) కూడా ఉండటం విశేషం.

raashikhanna5.jpg

తమన్నా అయితే 'ఉఫ్' అని చేసి మంట పుట్టిస్తున్నావు అన్నట్టుగా ఒక మూడు ఫైర్ ఎమోజీలు పెట్టింది. రెజీనా కూడా అదే మంట ఎమోజీలు ఒక నాలుగు పెట్టింది. ఇంకా ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2023-06-19T15:22:46+05:30 IST