Chiyaan 62: చియాన్ విక్రమ్ 62వ ప్రాజెక్ట్‌లో మరో విలక్షణ నటుడు

ABN , Publish Date - Feb 09 , 2024 | 06:26 PM

విలక్షణ నటుడు, ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం తన 62వ ప్రాజెక్ట్‌ను ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం చియాన్ 62 అని వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఈ క్రేజీ ప్రాజెక్టులోకి మరో విలక్షణ నటుడు ఎస్‌జె సూర్య కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Chiyaan 62: చియాన్ విక్రమ్ 62వ ప్రాజెక్ట్‌లో మరో విలక్షణ నటుడు
Chiyaan Vikram

విలక్షణ నటుడు, ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) ప్రస్తుతం తన 62వ ప్రాజెక్ట్‌ను ఎస్.యు. అరుణ్ కుమార్ (SU Arun Kumar) దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం చియాన్ 62 (Chiyaan62) అని వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఈ క్రేజీ ప్రాజెక్టులోకి మరో విలక్షణ నటుడు ఎస్‌జె సూర్య కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Suryah.jpg

ఎస్.యు. అరుణ్ కుమార్ గతంలో ‘పన్నయ్యరుమ్ పద్మినియుమ్’, ‘సేతుపతి’, ‘సింధుబాద్’, ఇటీవల హిట్ చిత్రం ‘చిత’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. చియాన్ విక్రమ్ ఈ సినిమాలో ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. శిబు థమీన్ కుమార్తె రియా శిబు (Riya Shibu) ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ (HR Pictures) బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.


SJ-Suryah.jpg

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ గతంలో ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేసి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు విలక్షణ నటుడు ఎస్‌జె సూర్య (SJ Suryah) ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఇంట్రెస్ట్‌ను పెంచారు. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారని చిత్రబృందం చెబుతోంది. చియాన్ విక్రమ్, ఎస్‌జె సూర్యల కలయికతో రాబోతోన్న ఈ సినిమా అభిమానులలో అంచనాలను పెంచడమే కాకుండా ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ ఆసక్తిని క్రియేట్ అయ్యేలా చేస్తోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Karthik Gattamneni: తెలుగులో ‘ఈగల్’.. హిందీలో ‘సహదేవ్’ అని ఎందుకు పెట్టామంటే..

*************************

*Director Maruthi: ‘ట్రూ లవర్’ జంటతో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తాం

**************************

*ప్రకటనలతో సరిపెట్టొద్దు.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లండి: విజయ్‌కి ఈ సూచన ఎవరిచ్చారో తెలుసా..?

****************************

Updated Date - Feb 09 , 2024 | 06:26 PM