Aalakaalam: ప్రాణాంతక విషం పేరుతో సినిమా.. సెన్సార్ టాక్ ఇదే..

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:16 AM

జయకృష్ణ - చాందిని జంటగా ‘ఆలకాలం’ పేరుతో ఒక చిత్రం రూపుదిద్దుకుంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో తల్లి పాత్రలో సీనియర్‌ నటి ఈశ్వరీరావు మరోమారు వెండితెరపై మెప్పించనున్నారు. ఇతర పాత్రల్లో దీప, బాబా భాస్కర్‌, తంగదురై, కోదండం, సిజర్‌ మనోహర్‌ తదితరులు నటించారు. ప్రేమ, సెంటిమెంట్‌, యాక్షన్‌ ఇలా అన్ని అంశాలు కలగలిసిన చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

Aalakaalam: ప్రాణాంతక విషం పేరుతో సినిమా.. సెన్సార్ టాక్ ఇదే..
Aalakaalam Movie Poster

జయకృష్ణ (Jayakrishna) - చాందిని (Chandini) జంటగా ‘ఆలకాలం’ (Aalakaalam) పేరుతో ఒక చిత్రం రూపుదిద్దుకుంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో తల్లి పాత్రలో సీనియర్‌ నటి ఈశ్వరీరావు (Easwari Rao) మరోమారు వెండితెరపై మెప్పించనున్నారు. ఇతర పాత్రల్లో దీప, బాబా భాస్కర్‌, తంగదురై, కోదండం, సిజర్‌ మనోహర్‌ తదితరులు నటించారు. ప్రేమ, సెంటిమెంట్‌, యాక్షన్‌ ఇలా అన్ని అంశాలు కలగలిసిన చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు ఏ ఒక్కరి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేయని జయకృష్ణ.. తొలిసారి దర్శకత్వం వహించారు. గతంలో కూడా లోకేష్‌ కనకరాజ్‌, ఉరియడి విజయకుమార్‌, కార్తీక్‌ నరేన్‌ వంటివారు కూడా ఇదే జాబితాలోకి వస్తారు. కె.సత్యరాజ్‌ కెమెరామెన్‌, ఎన్‌.ఆర్‌.రఘునందన్‌ సంగీతం అందించారు. (Aalakaalam Censor Completed )


Chandini.jpg

ఈ సందర్భంగా జయకృష్ణ (Jayakrishna) మాట్లాడుతూ... ‘ఆలకాలం’ అంటే ప్రాణాంతక విషం. మోసం, కుళ్ళు, కుతంత్రాలు, మద్యం, డ్రగ్స్‌, అణిచివేత ఇలాంటివాటిలో ప్రపంచం చిక్కుకుని నలిగిపోతోంది. ఇలాంటి సమాజంలో ఆదర్శంగా పెంచుకున్న కుమారుడు, విజయ లక్ష్యం కోసం పోరాడే యువకుడు, ఆత్మవిశ్వాసంతో ప్రేమకోసం ఎదురు చూసే ప్రేయసి, జీవితాలను నాశనం చేయాలనే విలన్లు ఇలా అనేక సమస్యల మధ్య తల్లి ఆశయం, యువకుడి ప్రయత్నం, ప్రియురాలి ప్రేమ సఫలమైందా? లేదా? అన్నదే ఈ చిత్ర కథ. యాక్షన్‌ సెంటిమెంట్‌ చూసిన సెన్సార్‌ సభ్యులే మెచ్చుకున్నారు. కుటుంబం, తల్లి, భార్యాభర్తలకు అతీతంగా ఒక మంచి సామాజిక సందేశంతో కూడిన చిత్రాన్ని నిర్మించారంటూ ప్రశంసించారని పేర్కొన్నారు. (Aalakaalam Movie Concept)


ఇవి కూడా చదవండి:

====================

*Allu Arjun: మరో రికార్డ్ బద్దలైంది.. ఐకాన్‌స్టార్‌ని ఆపతరమా..

************************

*Thalakona: కశ్మీర్ యాపిల్‌‌లా ఉండే అప్సరా రాణి.. కశ్మీర్ మిర్చి‌లా..

*********************

*Earthquake: జపాన్‌లో భూకంపం.. 28వ అంతస్తులో రాజమౌళి ఫ్యామిలీ..!

***********************

Updated Date - Mar 22 , 2024 | 11:16 AM