HanuMan: 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా రికార్డ్

ABN , Publish Date - Feb 02 , 2024 | 07:34 PM

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ సెన్సేషన్ ‘హను-మాన్’ చిత్రం.. 92 సంవత్సరాల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచి సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన మొదటి సినిమా అయిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకుపోతోంది.

HanuMan: 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా రికార్డ్
Hanu Man Movie Still

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma), యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) లేటెస్ట్ సెన్సేషన్ ‘హను-మాన్’ (Hanu-Man) చిత్రం.. 92 సంవత్సరాల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచి సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన మొదటి సినిమా అయిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లో 5 మిలియన్ల మార్క్‌ను అధిగమించి, ఇంకా కలెక్షన్స్ రాబడుతూనే ఉంది.

పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా హిందీతో సహా అన్ని భాషలలో అద్భుతమైన వసూళ్లను సాధించింది. ముఖ్యంగా నార్త్ రీజియన్‌లో ఈ ‘హను-మాన్’ చిత్రం స్ట్రెయిట్ హిందీ సినిమాలా అలరించి.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌ను రాబడుతోంది. రీజనబుల్ టిక్కెట్ ధరలతో కూడా ఈ సినిమా అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా.. ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర చరిత్రలో సంక్రాంతికి వచ్చిన సినిమాల రికార్డ్‌లన్నింటిని బ్రేక్ చేసి.. అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టి.. అతి పెద్ద విజయాన్ని నమోదు చేసినట్లుగా మేకర్స్ గర్వంగా ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ విడుదల చేశారు. (All-time Sankranthi Blockbuster)


HanuMan.jpg

మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి (K Niranjan Reddy) నిర్మించిన ఈ ‘హను-మాన్’ చిత్రం.. మూడు వారాల రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు నాలుగో వారంలోకి ఎంటరైంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మరికొన్ని వారాల పాటు హను-మాన్ అద్భుతమైన రన్ కొనసాగుతుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అందుకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ గడువును కూడా మేకర్స్ పెంచినట్లుగా తెలుస్తోంది. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య వంటి వారు ఇతర పాత్రలలో నటించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Family Star: ‘దేవర’ డేట్‌కే ఫిక్సయిన ‘ఫ్యామిలీ స్టార్’.. అయోమయంలో తారక్ ఫ్యాన్స్‌

*****************************

*Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌పై మంచు మోహన్ బాబు స్పందనిదే..

*************************

*Bubblegum: సుమ తనయుడి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..

**************************

Updated Date - Feb 02 , 2024 | 07:34 PM