Sharathulu Varthisthai in OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘షరతులు వర్తిస్తాయి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ABN , Publish Date - May 18 , 2024 | 03:43 PM

చైత‌న్య రావ్, భూమి శెట్టి జంట‌గా న‌టించిన సినిమా ‘ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి’. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. మార్చి 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. తాజాగా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.

Sharathulu Varthisthai in OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘షరతులు వర్తిస్తాయి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Sharathulu Varthisthai Movie Still

చైత‌న్య రావ్ (Chaitanya Rao), భూమి శెట్టి (Bhoomi Shetty) జంట‌గా న‌టించిన సినిమా ‘ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి’ (Sharathulu Varthisthai). కుమార‌స్వామి(అక్ష‌ర‌) (Akshara Kumara Swamy) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. మార్చి 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా మే 18 నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలో ఈ సినిమా మంచి స్పందనను రాబట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. (Sharathulu Varthisthai In OTT)

‘షరతులు వర్తిస్తాయి’ కథేంటంటే? (Sharathulu Varthisthai Story)

చిరంజీవి (చైతన్య రావు) ఒక గవర్నమెంట్ ఆఫీస్‌లో పనిచేస్తుంటాడు. తన అవసరాలను తీర్చుకునే క్రమంలో ఎంతగానో కష్టపడుతుంటాడు. చిరంజీవి తన ఫ్యామిలీని అంటే.. తన తల్లిని, ఇద్దరు తోబుట్టువులను చూసుకోవాలి. తండ్రి లేని ఆ కుటుంబానికి చిరంజీవే పెద్ద దిక్కు. అలాగే తన చిన్నప్పటి నుండి తన సపోర్ట్ సిస్టమ్‌గా ఉన్న విజయశాంతి (భూమి శెట్టి)తో లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుంటాడు. అనంతరం ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లి అనంతరం భార్య చేసిన ఓ పనితో చిరంజీవి జీవితం తలకిందులవుతోంది. ఓ ఆర్ధిక మోసం అతని జీవితాన్ని కలవరపెడుతుంది. అదేమిటి? దానిని చిరంజీవి ఎలా ఎదుర్కొన్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. (Sharathulu Varthisthai in Aha OTT)


Chaitanya-rao.jpg

ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసే కంటెంట్ ఇందులో అయితే పుష్కలంగానే ఉంది. ఓటీటీ ప్రేక్షకులకు ఈ సినిమా కాస్త కాలక్షేపాన్ని ఇచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆహా ఆన్ చేయండి. హాయిగా ఇంట్లోనే ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా చూసేయండి.

Read Latest Cinema News

Updated Date - May 18 , 2024 | 03:57 PM