మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

EAGLE: ఇంకో 24 గంటల్లో.. రెండు ఓటీటీలలో రవితేజ ‘ఈగల్’.. మీరు సిద్ధమా!

ABN, Publish Date - Feb 28 , 2024 | 09:35 PM

మాస్ మ‌హారాజా ర‌వితేజ, అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ , కావ్య థాప‌ర్ జంట‌గా న‌టించిన చిత్రం ఈగ‌ల్. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్పుడు ఈ సినిమా ఒకేసారి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

EAGLE

మాస్ మ‌హారాజా ర‌వితేజ (Ravi Teja), అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ (Anupama Parameswaran), కావ్య థాప‌ర్ (Kavya Thapar) జంట‌గా న‌టించిన చిత్రం ఈగ‌ల్ (Eagle). కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని (Karthik Gattamneni) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా పీపుల్స్ మీడియా (People Media Factory) బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ ప్ర‌సాద్ (Vishwa Prasad) నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై రూ.50 కోట్ల‌కు పైగానే వ‌సూళ్లు రాబ‌ట్టి మంచి హిట్‌గా నిలిచింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. మొదట తెలుగులోని ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జాలు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), నెట్‌ఫ్లిక్స్ (Netflix), ఆహ (aha video)ల‌తో పోటీ ప‌డి మరి ఈ టీవీ, ఈ టీవీ విన్ (E TV Win) ఈగ‌ల్ చిత్ర ఓటీటీ, శాటిలైట్ రైట్స్ హ‌క్కుల‌ను ద‌క్కించుకునట్లు సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అయ్యాయి.

అయితే తాజాగా ఈ టీవీతో పాటుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ మార్చి 1 నుంచి ఈగ‌ల్ (Eagle) సినిమా స్ట్రీమింగ్ అవనున్నట్లు అధికారకంగా ప్రకటించాయి. దీంతో ఈ చిత్రం మరో 24 గంటల్లో ఒకేసారి రెండు ఓటీటీల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.


క‌థ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విచ్చ‌ల‌విడిగా పెరిగిపోతున్న మార‌ణాయుధాలు, డ్ర‌గ్స్ చ‌లామ‌ణిని త‌గ్గించేందుకు హీరో పోరాటం చేస్తుంటాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు దేశంలోని మిల‌టరీ, ప్రత్యేక రా టీమ్ లు ఆపరేషన్ మొదలు పెడుతాయి. మరో వైపు మావోయిస్ట్స్‌, విదేశీ గ్యాంగ్‌స్ట‌ర్‌లు హీరోను చంపేందుకు బ‌ల‌గాల‌ను దింపుతాయి. ఈక్ర‌మంలో వారిని హీరో ఎలా ఎదుర్కొన్నాడ‌నే ఆస‌క్తిక‌ర క‌థ‌నంతో, ఔట్ అండ్ ఔట్ గూస్‌బంప్స్ తెప్పించే యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో (Eagle) సినిమాను రూపొందించారు.

Updated Date - Feb 28 , 2024 | 10:54 PM