Mega vs Allu: మరోసారి రివీలైన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య యుద్ధం

ABN , Publish Date - Jun 12 , 2024 | 08:31 PM

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవం బుధవారం గ్రాండ్‌గా జరగగా.. ఈ వేడుక ద్వారా మరోసారి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య యుద్ధం జరుగుతుందనే విషయం రివీలైందనేలా వార్తలు వైరల్ అవుతుండటం విశేషం. ఈ వేడుకను చూసేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. కానీ అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఒక్కరు కూడా ఈ వేడుకలో కనిపించలేదు. దీంతో ఈ రెండు ఫ్యామిలీల మధ్య వార్ నడుస్తుందని అంతా మాట్లాడుకుంటున్నారు.

Mega vs Allu: మరోసారి రివీలైన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య యుద్ధం
Allu Arjun and Ram Charan

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా (AP CM) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణస్వీకారోత్సవం బుధవారం గ్రాండ్‌గా జరగగా.. ఈ వేడుక ద్వారా మరోసారి మెగా ఫ్యామిలీ (Mega Family), అల్లు ఫ్యామిలీ (Allu Family)ల మధ్య యుద్ధం జరుగుతుందనే విషయం రివీలైందనేలా వార్తలు వైరల్ అవుతుండటం విశేషం. రీసెంట్‌గా ఢిల్లీ పర్యటన ముగించుకుని అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. తన అన్న చిరంజీవికి, వదిన సురేఖమ్మకు.. అలాగే అమ్మ అంజనాదేవి కాళ్లకి నమస్కరించి, ఆశీస్సులు తీసుకున్నారు. ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే, మెగా ఫ్యామిలీలో ఏ చిన్న సెలబ్రేషన్ జరిగినా షేర్ చేసుకునే అల్లు ఫ్యామిలీ ఈ సందర్భంలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలాగే బుధవారం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం (Chandrababu and Pawan Kalyan Swearing Ceremony) చేశారు. ఈ వేడుకను చూసేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. కానీ అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఒక్కరు కూడా ఈ వేడుకలో కనిపించలేదు. దీంతో ఈ రెండు ఫ్యామిలీల మధ్య అంతర్యుద్ధం నడుస్తుందనేది మరోసారి స్పష్టమైందని అంతా మాట్లాడుకుంటుండటం గమనార్హం.

Pawan-Kalyan.jpg

అల్లు అర్జునే (Allu Arjun) కారణమా?

మెగా, అల్లు బాండింగ్ ముక్కలవడానికి కారణం అల్లు అర్జునే అనేలా టాక్ ఎప్పటి నుండో వినబడుతోంది. అల్లు అర్జున్ మెగా ట్యాగ్ నుంచి బయటపడి, తనకంటూ ఒక సైన్యం క్రియేట్ చేసుకునే క్రమంలో ‘అల్లు ఆర్మీ’ (Allu Army)ని లైన్‌లోకి తెచ్చాడు. అప్పటి నుంచి మెగా-అల్లు కుటుంబాల, ఫ్యాన్స్ మధ్య ఏదో ఒక రూపంలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ‘పుష్ప’ (Pushpa) విజయంతో అల్లు ఆర్మీని, అల్లు అర్జున్‌ని ఆపడం మెగా ఫ్యాన్స్ వల్ల కూడా కాలేదు. అదే సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు కూడా అందుకున్న అల్లు అర్జున్.. ఇక తగ్గేదేలే అన్నట్లుగా తన తీరును ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఇది మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్‌ (Mega Fans)కు కూడా నచ్చలేదు. నాకు కావాల్సింది కూడా ఇదే అన్నట్లుగా అల్లు అర్జున్ చెలరేగిపోతుండటంతో పాటు.. రీసెంట్‌గా ఎన్నికల క్యాంపెయిన్ విషయంలో మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన కూటమి (Kutami)ని కాదని, వైఎస్ఆర్‌సీపీ (YSRCP)కి చెందిన తన స్నేహితుడి ప్రచార నిమిత్తం చేసిన వ్యాఖ్యలు విన్నవారంతా.. కావాలనే అల్లు అర్జున్ ఇదంతా చేస్తున్నాడనే అభిప్రాయానికి వచ్చేశారు.

Pawan-Kalyan-2.jpg

పొలిటికల్‌గా అల్లు అర్జున్ జీరో..

అవును.. అల్లు అర్జున్ రేంజ్ పొలిటికల్‌గా జీరో అనే చెప్పాలి. ఎందుకంటే, మొన్నటి ఏపీ ఎన్నికలలో ఆయన మద్దతు తెలిపిన వైసీపీ నేత శిల్ప రవికిశోర్ చంద్ర రెడ్డి ఓడిపోయాడు. అంతకుముందు తెలంగాణ ఎన్నికలలో తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్‌ఎస్ టికెట్ ఆశించి.. అల్లు అర్జున్‌ను కంచర్ల కన్వెన్షన్‌ పేరుతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి పిలిపించి హడావుడి చేశాడు. తనకు టికెట్ ఇస్తే.. అల్లు అర్జున్ ప్రచారంలో పాల్గొంటాడనేలా కూడా కంచర్ల అప్పుడు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్‌ని చూపించినా కూడా గులాబీ బాస్ ఆయనకు మొండిచెయ్యే చూపించారు. ఆ తర్వాత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఆశించినట్లుగా వార్తలైతే వచ్చాయి కానీ.. అక్కడా ఆయనకు నిరాశే ఎదురైంది. సో.. ఈ లెక్కన అల్లు అర్జున్ పవర్ పొలిటికల్‌గా ఏ మాత్రం పనిచేయలేదనేది స్పష్టమైంది.

Allu-Family.jpg

Also Read- Nara Rohith: పెదనాన్న.. అంటూ నారా రోహిత్ రాసిన లెటర్ వైరల్


Nagababu.jpg

రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ (Ram Charan Vs Allu Arjun)

రామ్ చరణ్ రేంజ్ కూడా అల్లు అర్జున్ సెపరేషన్‌కు కారణం అనేలా కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం విశేషం. రామ్ చరణ్ కంటే ముందే హీరోగా లాంచ్ అయినా.. బన్నీకి సరైన బ్లాక్ బస్టర్ పడటానికి చాలా సమయం పట్టింది. కానీ రామ్ చరణ్‌ రెండో సినిమానే అందులోనూ గీతా ఆర్ట్స్‌లో చేసిన సినిమానే ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో ఒక్కసారిగా చరణ్ రేంజ్ మారిపోయింది. అదే సమయంలో తనకీ అలాంటి సినిమా కావాలని బన్నీ పట్టుబట్టి మరీ ‘బద్రీనాధ్’ అనే సినిమా చేశారు. ఆ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. ‘మగధీర’ సినిమా తర్వాత రామ్ చరణ్ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సినిమాలు పరాజయం పాలైనా.. రామ్ చరణ్ రేంజ్ పెరుగుతూనే వచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ రేంజ్ గ్లోబల్‌ స్థాయికి చేరుకుంది. చరణ్ ఎదుగుదలను చూడలేకే.. అల్లు అర్జున్ మెగా ట్యాగ్ వదిలి.. అల్లు పవర్ చూపించాలనే నిర్ణయానికి వచ్చాడనేలా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ పిఠాపురం వెళుతున్నాడని తెలిసి.. సడెన్‌గా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లినట్లుగా కూడా టాక్ వైరలైంది.

Chiranjeevi.jpg

అసలీ అంతర్యుద్ధం ఎక్కడ మొదలైంది?

అల్లు అర్జున్ సంగతి పక్కన పెడితే.. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య ఈ అంతర్యుద్ధానికి కారణం ఏమై ఉంటుందా? అని అంతా తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే దీనికి బీజం చిరంజీవి రీ ఎంట్రీ ఫిల్మ్‌తో (Chiranjeevi Re Entry Film) పడిందనే వాదనలు బాగా వినిపిస్తున్నాయి. చిరుతో ఎన్నో సూపర్ హిట్స్ కొట్టిన నిర్మాత అల్లు అరవింద్.. చిరంజీవి రీ ఎంట్రీ ఫిల్మ్‌ని నిర్మించాలని ఆశపడ్డారు. కానీ ఆ సినిమాని రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించారు. ఆ తర్వాత సినిమాకు కూడా అల్లు అరవింద్‌కి ఛాన్స్ దక్కలేదు. వరసగా చిరుతో రామ్ చరణ్ మూడు సినిమాలను లాక్ చేశారు. దీంతో అల్లు అర్జున్ హర్ట్ అయ్యాడని, అప్పటి నుంచే అల్లు పవర్ ఇదని చాటేందుకు ఆర్మీ ట్యాగ్ తలిగించుకున్నాడనేలా టాక్ అయితే వినబడుతోంది. ఈ విషయం ఎంత వరకు నిజమో? తెలియదు కానీ.. ఎక్కువగా మాత్రం ఇండస్ట్రీలో ఇదే టాక్ డిస్కస్ అవుతూ ఉంటుంది. ఏదయితేనేం.. ప్రస్తుతం మెగా, అల్లు ఫ్యామిలీల (Allu Family) మధ్య అంతర్యుద్ధం నడుస్తుందనే దానికి ఈ మధ్య పలు సంఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న దూరాన్ని ఎంత త్వరగా దూరం చేసుకుంటే అంత మంచిది అనేలా.. విమర్శకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 12 , 2024 | 08:31 PM