Ram Charan: 30 ఏళ్లు తిరుగులేని ప్రస్థానం

ABN , First Publish Date - 2023-07-31T12:22:40+05:30 IST

‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ర్టీలో నిజమైన ‘గేమ్‌ ఛేంజర్‌’9Game Changer) దర్శకుడు శంకర్‌’ (Shankar) అని గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌(Ram charan) ట్వీట్‌ చేశారు. శంకర్‌ సినీ ప్రస్థానానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్‌ చేశారు. ఆయనది తిరుగులేని ప్రస్థానమని కొనియాడారు.

Ram Charan: 30 ఏళ్లు తిరుగులేని ప్రస్థానం

‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ర్టీలో నిజమైన ‘గేమ్‌ ఛేంజర్‌’9Game Changer) దర్శకుడు శంకర్‌’ (Shankar) అని గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌(Ram charan) ట్వీట్‌ చేశారు. శంకర్‌ సినీ ప్రస్థానానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్‌ చేశారు. ఆయనది తిరుగులేని ప్రస్థానమని కొనియాడారు. 1993లో వచ్చిన ‘జెంటిల్‌మెన్‌’ చిత్రంతో శంకర్‌ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రం జూలై 30, 1993లో విడుదలైంది. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌.. శంకర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం రూపొందుతోంది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, సునీల్‌, శ్రీకాంత్‌, ఎస్‌. జె. సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర కీలక పాత్రధారులు. దిల్‌ రాజు నిర్మాత. ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు, కమల్‌హాసన్‌ హీరోగా ‘ఇండియన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కోసం లాస్‌ ఏంజెల్స్‌లోని ‘లోలా’ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థతో చర్చల కోసం అమెరికా వెళ్లారు.

రామ్‌చరణ్‌ ట్వీట్‌కు అభిమానులు స్పందించారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ అప్‌డేట్‌ ఎక్కడాః అని ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి దీనికి చరణ్‌, నిర్మాత దిల్‌ రాజు ఏమంటారో చూడాలి.

Updated Date - 2023-07-31T12:25:51+05:30 IST