ఎన్నో సీరియల్స్‌కు పనిచేసిన సీనియర్ కెమెరామెన్ మృతి

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:06 PM

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌కి కెమెరామెన్‌గా, ఎడిటర్‌గా, అవుట్ డోర్ యూనిట్ అధినేతగా పనిచేసిన పోతన వెంకట రమణ అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. కొన్నాళ్లుగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న వెంకట రమణకు మంగళవారం పరిస్థితి విషమించడంతో.. కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్చినా.. ఫలితం దక్కలేదు. బుధవారం చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

ఎన్నో సీరియల్స్‌కు పనిచేసిన సీనియర్ కెమెరామెన్ మృతి
Senior Cameraman Pothana Venkata Ramana

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌కి కెమెరామెన్‌గా, ఎడిటర్‌గా, అవుట్ డోర్ యూనిట్ అధినేతగా పనిచేసిన పోతన వెంకట రమణ (Pothana Venkata Ramana) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. కొన్నాళ్లుగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న వెంకట రమణకు.. సడెన్‌గా ఆ సమస్య ఎక్కువ కావడంతో ఆయనను మంగళవారం కుటుంబ సభ్యులు నిమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అయితే సమస్య తీవ్రతరం కావడంతో బుధవారం ఆయన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. (Senior TV Cameraman Pothana Venkata Ramana No More)

పోతన వెంకట రమణ స్వస్థలం మచిలీపట్నం (Machilipatnam). బుల్లితెరపై ఎన్నో ప్రజాదరణ పొందిన సీరియల్స్‌కు ఆయన కెమెరామెన్‌గా వ్యవహరించారు. అందులో ‘ఋతురాగాలు (Ruthuragalu), సంసారం సాగరం, సిరి, బొమ్మరిల్లు’ వంటివి ఉన్నాయి. ఎస్వీబిసి (SVBC) ఛానల్ నిర్మించిన ‘శ్రీ వైనతేయ’ ధారావాహికకు 2009 సంవత్సరంలో ఉత్తమ కెమెరామెన్‌‌గా ఆయన నంది పురస్కారం(Nandi Award) అందుకున్నారు.


Pothana-Venkata-Ramana.jpg

అలాగే పూరి జగన్ (Puri Jagan) తొలిసారి దర్శకత్వం వహించిన దూరదర్శన్ టెలీ ఫిల్మ్ ‘జీవితం’ (Jeevitham)కు పోతన వెంకట రమణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించడం గమనార్హం. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకట రమణ మృతి వార్త తెలిసి.. టీవీ కెమెరామెన్ల సంఘంతో పాటు టీవీ పరిశ్రమలోని పలువురు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు స్వస్థలమైన మచిలీపట్నంలో నిర్వహించనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Kona Venkat: తారక్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా..

************************

*Paiyaa: 14 యేళ్ల తర్వాత ‘పయ్యా’ రీ రిలీజ్‌

*******************************

*Vijay Deverakonda: అలా చెప్పడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు

******************************

*Natti Kumar: వలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి వర్క్ చేయండి.. సజ్జలకు ఆ రైట్ లేదు

***********************

Updated Date - Apr 04 , 2024 | 12:06 PM