scorecardresearch

Vijay Deverakonda: అలా చెప్పడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:01 PM

రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్ సినిమా చేస్తానని చెప్పడం తప్పు కాదు. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా... రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల సినిమా చేస్తా. ఇది బలుపు, అహంకారం అనుకున్నా సరే.. అని అన్నారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ ఈ కామెంట్స్ చేశారు.

Vijay Deverakonda: అలా చెప్పడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు
Family Star Vijay Deverakonda

‘‘రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్ సినిమా చేస్తానని చెప్పడం తప్పు కాదు. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా... రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల సినిమా చేస్తా. ఇది బలుపు, అహంకారం అనుకున్నా సరే..’’ అని అన్నారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఆయన హీరోగా, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju), టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల (Parasuram Petla) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మంగళవారం దూలపల్లి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

*Dil Raju: విజయ్ దేవరకొండతో త్వ‌ర‌లో భారీ పాన్ ఇండియా మూవీ.. దిల్ రాజు ఫ్లాన్ మాములుగా లేదుగా


హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. (Vijay Deverakonda Speech) ‘‘ఆరేళ్ల కిందట నా కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘గీత గోవిందం’ (Geetha Govindham) ఇదే డైరెక్టర్‌తో చేశాను. ఆ రోజులు వేరు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి వరుసగా సూపర్ హిట్స్ ఇస్తున్నాడని నా గురించి మాట్లాడుకున్నారు. నా మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’ టైమ్‌లో మీ గురించి మీరు వినాలని అనుకుంటున్న పెద్ద గాసిప్ ఏంటని అడిగితే.. నా సినిమా వంద కోట్ల రూపాయలు వసూళ్లు చేసినట్లు న్యూస్ చూడాలి అన్నాను. అది నా బిగ్గెస్ట్ డ్రీమ్ అప్పటికీ. ఆ డ్రీమ్ నా నాలుగో సినిమాకే నిజమైంది. ‘గీత గోవిందం’ వంద కోట్ల రూపాయల వసూళ్లు చేసింది. ఆ తర్వాత అలాంటి మూవీ నాకు దక్కలేదు. వంద కోట్ల రూపాయల వసూళ్ల సినిమా అందుకోవాలి అని చెప్పిన కుర్రాడు.. తన మరో సినిమా రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్ చేస్తుందని చెప్పాడు. కానీ అందుకోలేకపోయాడు. అలా ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చావు అని నాతో చాలా మంది అన్నారు. నీ వయసు హీరో అలా మాట్లాడితే అహంకారం అనుకుంటారు అని ప్రేమతో నాకు చెప్పిన పెద్దవాళ్లున్నారు. రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్ సినిమా చేస్తానని చెప్పడం తప్పు కాదు. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా... రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల సినిమా చేస్తా. ఇది బలుపు, అహంకారం అనుకున్నా సరే. కానీ ఇది నా మీద నాకున్న నమ్మకం, విశ్వాసం. (Family Star Pre Release Event)

Family-Star-Movie.jpg

నేను ఉదయం లేచినప్పడు, షూటింగ్‌కు వెళ్లినప్పుడు, ఈ వేదిక మీద మాట్లాడేప్పుడు అదే కాన్ఫిడెన్స్‌తో ఉంటా. ఇంకొకరు స్టార్ కాగా లేనిది మనం కాలేమా, మీరు కాలేరా, ఇంకొకరు రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ కొట్టగా లేంది నేను ఆ ఫీట్ సాధించలేనా. ‘పెళ్లి చూపులు’ (Pelli Choopulu) నుంచి ‘ఫ్యామిలీ స్టార్’ వరకు నేను చేసిన ప్రతి సినిమా ఏదో కొత్త విషయాన్ని నేర్పించింది. ఇదొక జర్నీ. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు ఎదురవుతుంటాయి. అవన్నీ దాటుకుని మనం అనుకున్నది సాధించాలి. మనకు మన గోల్ మాత్రమే కనిపించాలి. నేను అలాగే అనుకుంటా. అదే నమ్మకంతో పనిచేస్తుంటా. మీలో చాలా మంది యాక్టర్స్, బిజినెస్ మెన్, డైరెక్టర్స్, కంటెంట్ క్రియేటర్స్.. ఇలా ఏదో ఒకటి సాధించాలని అనుకుంటారు. ఆ కల నెరవేర్చుకునేందుకు ప్రయత్నించండి. నేను నా మొదటి సినిమా ప్రీ రిలీజ్‌లోనే చెప్పాను. తలెత్తుకోండి, హ్యాపీగా ఉండండి.


Family-Star.jpg

నా జర్నీలో ఫ్యామిలీ స్టార్ ఒక ఇంపార్టెంట్ స్టాప్. పరశురామ్ (Parasuram) నాకు ఈ కథ చెప్పినప్పుడు మా నాన్న గుర్తుకువచ్చాడు. మాకు కష్టాలు తెలియకుండా కష్టపడ్డారు నాన్న. ఆయన మా ఫ్యామిలీ స్టార్. యూకే వెళ్లి మా అందరికీ సపోర్ట్‌గా నిలిచిన మామయ్య, తమ్ముడిని యూఎస్ పంపేందుకు హెల్ప్ చేసిన మా దుబాయ్ అన్నయ్య, పెద్దమ్మ.. ఇలా ఫ్యామిలీలోని చాలా మంది గుర్తుకువచ్చి ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. ప్రతి ఫ్యామిలీలో స్టార్ ఉంటాడు. ఆ స్టార్ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమా నాకు దక్కడం, ఆ సినిమాను మీ ముందుకు నా ద్వారా తీసుకురావడం ఒక బ్లెస్సింగ్‌లా భావిస్తున్నా. ఈ సినిమాలో నా పెర్ఫార్మెన్స్ నెక్ట్ లెవెల్ అని డైరెక్టర్ చెప్పారు. కానీ నేను చేసిన పెర్ఫార్మెన్స్‌కు మొత్తం క్రెడిట్ పరశురామ్‌కే ఇవ్వాలి. ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీకి హెడ్ మా దిల్ రాజు (Dil Raju) గారు. ఆయన ఈ సినిమా కోసం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్, రిలీజ్ వర్క్స్ తో పాటు ప్రమోషన్‌లో మాతో అలుపులేకుండా తిరుగుతున్నారు. మాతో డ్యాన్సులు చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ పరశురామ్ గారు. ఆయన లేకుంటే ఈ సినిమానే లేదు. ఈ సినిమాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఆ క్రెడిట్ అంతా పరశురామ్ దే. ఈ సమ్మర్ కు మా టీమ్ నుంచి మీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ ఫ్యామిలీ స్టార్. మీ ఫ్యామిలీస్‌తో కలిసి చూసి ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు. (Family Star Vijay Deverakonda)


ఇవి కూడా చదవండి:

====================

*Chiranjeevi: జారిపడినా డ్యాన్స్ ఆపలేదు, నాగపాములా ఆడుతూనే ఉన్నా! అప్పుడు మహానటి ఏమన్నారంటే?

**************************

*Natti Kumar: వలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి వర్క్ చేయండి.. సజ్జలకు ఆ రైట్ లేదు

***********************

*Saranya: సీనియర్ నటి శరణ్యపై పోలీసులకు ఫిర్యాదు

***************************

Updated Date - Apr 03 , 2024 | 01:02 PM