మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Samyuktha: ‘ఆదిశక్తి’గా.. సేవా మార్గంలోకి సంయుక్త

ABN, Publish Date - Apr 17 , 2024 | 05:10 PM

స్టార్ హీరోయిన్స్‌లో చాలా మంది కొన్ని సేవా సంస్థలను స్థాపించి.. ఎందరికో హెల్ప్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడా జాబితాలోకి ఈ మధ్య వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సంయుక్త కూడా చేరారు. ఆమె నిస్సహాయులైన మహిళలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. ఇకపై ‘ఆదిశక్తి’ అనే సేవా సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సంయుక్తా మీనన్ సహకారం అందించబోతున్నట్లుగా ప్రకటించారు.

Heroine Samyuktha Adi Shakti

స్టార్ హీరోయిన్స్‌లో చాలా మంది కొన్ని సేవా సంస్థలను స్థాపించి.. ఎందరికో హెల్ప్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడా జాబితాలోకి ఈ మధ్య వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సంయుక్త (Samyuktha) కూడా చేరారు. ఆమె నిస్సహాయులైన మహిళలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలకు తన వంతు పరిష్కారం సూచించే విధంగా, అలాగే వారికి సహాయం అందించేలా ఓ సమగ్రమైన ప్రణాళికతో ఈ స్టార్ హీరోయిన్ (Star Heroine) ముందడుగు వేసింది. శ్రీరామ నవమి (Srirama Navami) పర్వదినం సందర్భంగా ఆమె నూతనంగా ఏర్పాటు చేసిన సేవా సంస్థ వివరాలను అధికారికంగా ప్రకటించారు. ఇకపై ‘ఆదిశక్తి’ (Adishakti) అనే సేవా సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సంయుక్తా మీనన్ Samyuktha Menon) సహకారం అందించబోతున్నట్లుగా ప్రకటించారు.

*Jai Hanuman: ప్ర‌తి ఒక్క‌రూ.. గుర్తు పెట్టుకునేలా ‘జై హ‌నుమాన్’! ప్ర‌శాంత్ వ‌ర్మ పోస్ట్ వైర‌ల్


మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించి, వారిని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో ఈ ‘ఆదిశక్తి’ సంస్థను స్థాపించినట్లుగా సంయుక్త చెప్పుకొచ్చింది. అన్ని వయసుల మహిళలకు ఈ సంస్థ చేయూతనివ్వనుంది. విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం వంటి విషయాల్లో మహిళలకు ఈ ఆదిశక్తి సంస్థ సపోర్ట్‌గా నిలవనుందని.. మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలని, అన్ని రంగాల్లో తమ గొంతు వినిపించాలనేది ఆదిశక్తి సంస్థ ఉద్దేశమని సంయుక్త చెప్పుకొచ్చింది. (Actress Samyuktha Launches Adishakti)

Updated Date - Apr 17 , 2024 | 05:10 PM