SS Thaman: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో డల్లాస్‌లో థమన్ ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్

ABN , Publish Date - May 21 , 2024 | 08:19 PM

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌ థమన్ ఎస్.తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ అద్భుతమైన మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. డల్లాస్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో థమన్ త్వరలో అతి పెద్ద మ్యూజికల్ ఈవెంట్ చేయబోతున్నారు. ఈ స్పైస్ టూర్ జూన్ 1న ప్రారంభమవుతుందని తెలుపుతూ విడుదల చేసిన ప్రోమోలో గుంటూరు కారం నుంచి ధమ్ మసాలా అంటూ థమన్ చేసిన హంగామాను చూపించారు.

SS Thaman: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో డల్లాస్‌లో థమన్ ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్
S Thaman

సౌత్‌లో ప్రస్తుతం క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్‌ ఎవరంటే.. కచ్చితంగా థమన్. ఎస్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. చిన్న, మీడియం నుంచి పాన్ ఇండియన్ ప్రాజెక్టుల వరకు థమన్ (Thaman S) చేతిలో స్వరాలు సమకూర్చుకుంటున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల థమన్ పాటలు ఉర్రూతలూగిస్తుంటాయి. మెలోడీ, మాస్ బీట్‌లతో థమన్ శ్రోతలను ఆకట్టుకుంటూ.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

*Hema: రేవ్ పార్టీ కవరింగ్ కోసం రెసిపీ.. హేమతో ఆడేసుకుంటోన్న నెటిజన్లు

ప్రస్తుతం క్షణం కూడా తీరిక లేనంత బిజీగా థమన్ ఉన్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) ఓ అద్భుతమైన మ్యూజికల్ ఈవెంట్‌ (Musical Event)ను ప్లాన్ చేసింది. డల్లాస్‌ (Dallas)లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో థమన్ అతి పెద్ద మ్యూజికల్ ఈవెంట్ చేయబోతున్నారు.


ఈ స్పైసీ టూర్ జూన్ 1న ప్రారంభమవుతుందని తెలుపుతూ విడుదల చేసిన ప్రోమోలో ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) నుంచి ధమ్ మసాలా అంటూ థమన్ చేసిన హంగామాను చూపించారు. ఇప్పటి వరకు డల్లాస్‌లో జరగనంతగా.. భారీ స్థాయిలో ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

Read Latest Cinema News

Updated Date - May 21 , 2024 | 08:19 PM