Thaman S: వైజాగ్‌లో సందడి... సంగీతం అంటే ఏంటంటే...

ABN , First Publish Date - 2023-03-26T18:53:57+05:30 IST

సంగీత దర్శకుడు తమన్‌ (thaman s) వైజాగ్‌లో సందడి చేశారు. ఆంధ్రా యూనివర్శిటీలో, సెయింట్‌ లుక్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆడియో ఇంజినీరింగ్‌, మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ స్టూడియోను ఏయూ వీసీతో కలిసి తమన్‌ ప్రారంభించారు.

Thaman S: వైజాగ్‌లో సందడి... సంగీతం అంటే ఏంటంటే...

సంగీత దర్శకుడు తమన్‌ (thaman s) వైజాగ్‌లో సందడి చేశారు. ఆంధ్రా యూనివర్శిటీలో, సెయింట్‌ లుక్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆడియో ఇంజినీరింగ్‌, మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ స్టూడియోను ఏయూ వీసీతో కలిసి తమన్‌ ప్రారంభించారు. తమన్‌ మాట్లాడుతూ ‘‘తెలుగు నేల కళలకు పుట్టినిల్లు. తల్లిదండ్రుల నుంచి సంగీతం వారసత్వంగా అందుకున్నా. సంగీతం ఉన్నచోట ప్రశాంతత ఉంటుంది. .విశాఖ కేంద్రంగా ఇంతటి పెద్ద స్టూడియో నిర్మాణం చేయడం అభినందనీయం. ఆంధ్రాలో ఎందరో ప్రఖ్యాత కవులు, నటులు, సంగీత కళాకారులు జన్మించారు. ఇక్కడ భాష, యాస ఎంతో స్ఫూర్తినిస్తాయి. నా విశ్రాంత జీవితం విశాఖ నగరంలోనే ఉండాలని కోరుకుంటాను. భీమిలిలో ఓ మ్యూజిక్‌ రికార్డింగ్‌ స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నాను’’ అని అన్నారు.

ఏయూ వీసీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ‘‘తొలి దశలో రూ.3.5 కోట్లతో రికార్డింగ్‌ స్టూడియో, ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి సంగీత రంగంలో రాణించడానికి అవసరమైన కోర్సులు అందిస్తున్నాం. ఇటీవల సౌండ్‌ అండ్‌ రికార్డింగ్‌ ప్రి ప్రొడక్షన్‌ సర్టిఫికెట్‌ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాం. త్వరలో ఏయూ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నాం’’ అని అన్నారు. (Thaman wants to Launch studio in Vizag)

3.jpg

Updated Date - 2023-03-26T18:54:30+05:30 IST