న‌టుడు వీర భద్రయ్యకు ‘మనం సైతం’ కాదంబ‌రి కిర‌ణ్ సాయం

ABN , Publish Date - Jan 12 , 2024 | 04:04 PM

సినీ నటుడు, ‘మనం సైతం' ఫౌండేషన్ నిర్వ‌హ‌కులు కాదంబ‌రి కిర‌ణ్ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ప్ర‌మాదానికి గురై ఆందోళ‌న‌క‌రమైన ప‌రిస్థితుల్లో హ‌స్పిట‌ల్‌లో చేరిన సినీ, టీవీ న‌టుడు డీ. వీర‌భ‌ద్ర‌య్య‌కు రూ. 25,000 ఆర్థిక సాయం అందించారు. వీర‌భ‌ద్ర‌య్య‌కు మెరుగైన వైద్యం, క‌నీస అవ‌స‌రాల‌ను తీర్చేలా ఈ సాయం చేశారు. వారి కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు.

న‌టుడు వీర భద్రయ్యకు ‘మనం సైతం’ కాదంబ‌రి కిర‌ణ్ సాయం
Manam Saitham Kadambari Kiran Helps Artist Veerabhadrayya

సినీ నటుడు, ‘మనం సైతం' ఫౌండేషన్ నిర్వ‌హ‌కులు కాదంబ‌రి కిర‌ణ్ (Kadambari Kiran) మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ప్ర‌మాదానికి గురై ఆందోళ‌న‌క‌రమైన ప‌రిస్థితుల్లో హ‌స్పిట‌ల్‌లో చేరిన సినీ, టీవీ న‌టుడు డీ. వీర‌భ‌ద్ర‌య్య‌కు రూ. 25,000 ఆర్థిక సాయం అందించారు. వీర‌భ‌ద్ర‌య్య‌కు మెరుగైన వైద్యం, క‌నీస అవ‌స‌రాల‌ను తీర్చేలా ఈ సాయం చేశారు. వారి కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. డీ. వీర‌భ‌ద్ర‌య్య కుటుంబానికి అండ‌గా ఉంటానంటూ వారిలో ధైర్యం నింపారు. ఇలా నిరంత‌రం దాతృత్వం కొన‌సాగిస్తున్న‌ ఆయ‌న మాన‌వ‌త్వానికి ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

‘మనం సైతం’ (Manam Saitham) అనే ఫౌండేషన్ స్థాపించి.. ఎన్నో సంవ‌త్స‌రాలుగా కాదంబరి కిరణ్ సినీ పరిశ్రమలోని పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఈ ‘మనం సైతం' ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. పలువురు ప్రముఖులు కాదంబరి ‘మనం సైతం’ ఫౌండేషన్ గురించి తెలుసుకుని విరాళాలు అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని, సినీ స్టార్స్, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు మనం సైతంకు అండగా నిలబడుతున్నారు.


veerabhadrayya.jpg

ఆపద, అవసరం అని తలుపు తట్టినా.. ఫోన్ కాల్ వచ్చినా కాదంబరి కిరణ్ వెంటనే రియాక్ట్ అవుతారు. తనకు సాధ్యమైనంత సాయం అందించి.. వారి ఆపదను, అవసరాన్ని తీర్చేలా కృషి చేస్తారు. ఆయ‌న మాన‌వ‌త్వం గుండె గుండెను తాకుతోంది.. నిస్సాహ‌య‌కుల‌కు ‘మనం సైతం’ అంటూ ఆదుకుంటున్నారు. ఆప‌ద వ‌చ్చిన వారి వ‌ద్ద‌కి ఆయ‌నే వెళ్లి అండ‌గా నిల‌బ‌డుతున్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే అక్క‌డ ఆయ‌న ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. మనం సైతం! అంటూ సాయం అందిస్తున్న కాదంబరి కిరణ్‌కు అదే స్థాయిలో ప్రశంసార్హుడు.


ఇవి కూడా చదవండి:

====================

*సింగర్ సునీత కుమారుడి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. రిలీజైన 10 రోజులకే!

*************************

*Kalki 2898AD: రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ చారిత్రాత్మక డేట్‌కే!

*************************

*Vijay: విజయ్‌ న్యూ గెటప్‌.. అసలు విజయ్‌లా లేడు కదా!

*************************

*HanuMan: ‘హను-మాన్’ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ ఎంత ఇచ్చారంటే..

**********************

Updated Date - Jan 12 , 2024 | 04:04 PM