Manam Saitham: సినీ సౌండ్ ఇంజనీర్‌కి ‘మనం సైతం’ ఆర్థిక సాయం

ABN , Publish Date - Apr 03 , 2024 | 05:27 PM

సినీ నటుడు, ‘మనం సైతం’ కాదంబరి ఫౌండేషన్ నిర్వాహకులు కాదంబరి కిరణ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో పోరాడుతున్న సినీ సౌండ్ ఇంజనీర్ ఈమని శ్రీనివాస్‌కి ‘మనం సైతం’ నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం చేశారు. ఆపద కాలంలో ఆర్థిక సాయం చేసిన ‘మనం సైతం’ నిర్వాహకులు కాదంబరి కిరణ్‌కు ఆమె ఈమని శ్రీనివాస్‌ భార్య ఈమని శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపారు.

Manam Saitham: సినీ సౌండ్ ఇంజనీర్‌కి ‘మనం సైతం’ ఆర్థిక సాయం
Kadambari Kiran with Emani Srinivas Family

సినీ నటుడు, ‘మనం సైతం’ (Manam Saitham) కాదంబరి ఫౌండేషన్ (Kadambari Foundation) నిర్వాహకులు కాదంబరి కిరణ్ (Kadambari Kiran) మరోసారి మానవత్వం చాటుకున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో పోరాడుతున్న సినీ సౌండ్ ఇంజనీర్ ఈమని శ్రీనివాస్‌ (Emani Srinivas)కి ‘మనం సైతం’ నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం చేశారు. ఈమని శ్రీనివాస్ రావుకి కిడ్నీలు ఫెయిల్ అయ్యి తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో ఆయన భార్య ఈమని శ్రీదేవి (Emani Sridevi) తన కిడ్నీ దానం చేయడానికి సిద్ధమయ్యారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కై సాయం కోసం ‘మనం సైతం’ నిర్వాహకులను అభ్యర్థించగా కాదంబరి కిరణ్ సాయం అందించారు. ఆపద కాలంలో ఆర్థిక సాయం చేసిన ‘మనం సైతం’ నిర్వాహకులు కాదంబరి కిరణ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

*బోలెడు తీపి అనుభవాలు.. ఓ చేదు జ్ఞాపకం: కృతి శెట్టి

‘మనం సైతం’ ఫౌండేషన్ ద్వారా కాదంబరి కిరణ్ (Actor Kadambari Kiran) నిరంతరం సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. గతవారం సినీ రైటర్ భరత్ కుమార్ పక్షవాతం, హృద్రోగంతో తీవ్ర అనారోగ్యానికి గురికాగా.. వైద్య అవసరాలకై ‘మనం సైతం’ కుటుంబం నుంచి రూ. 25,000 సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. సూర్యాపేటకు చెందిన రిపోర్టర్ వై. రవి కుమార్ తల్లి తారమ్మ కిడ్నీస్ దెబ్బతిన్నాయి. వారి తండ్రికి కాళ్ళు ఇన్ఫెక్షన్‌తో ఇబ్బందులు పడుతున్నారని తెలిసి.. వారి వైద్యవసరాల కోసం ‘మనం సైతం’ కుటుంబం నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం చేశారు కాదంబరి కిరణ్. (Manam Saitham Helping Foundation)


Kadambari-Kiran.jpg

అలాగే సీనియర్ జర్నలిస్ట్ టి ఎల్ ప్రసాద్ (TL Prasad) కంటి ఆపరేషన్ కొరకు రూ. 25,000 ఆర్థిక సాయం అందించారు. పదేళ్లుగా మనం సైతం ఫౌండేషన్ ద్వారా కాదంబరి కిరణ్ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. మనం సైతం సిద్ధంగా ఉంటుందని కాదంబరి కిరణ్ (Manam Saitham Kadambari Kiran) చెప్పారు.


ఇవి కూడా చదవండి:

====================

*Vijay Deverakonda: అలా చెప్పడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు

******************************

*Chiranjeevi: జారిపడినా డ్యాన్స్ ఆపలేదు, నాగపాములా ఆడుతూనే ఉన్నా! అప్పుడు మహానటి ఏమన్నారంటే?

**************************

*Natti Kumar: వలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి వర్క్ చేయండి.. సజ్జలకు ఆ రైట్ లేదు

***********************

Updated Date - Apr 03 , 2024 | 05:27 PM