Hero Srikanth: నల్లగండ్లలో బాబాయ్ హోటల్‌ను ప్రారంభించిన హీరో శ్రీకాంత్

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:01 PM

లింగంపల్లిలోని నల్లగండ్లలో తాజాగా బాబాయి హోటల్ న్యూ బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ఈ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. బాబాయ్ హోటల్ నిర్వాహకులు కెవి దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి, మరికొందరు అతిథులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Hero Srikanth: నల్లగండ్లలో బాబాయ్ హోటల్‌ను ప్రారంభించిన హీరో శ్రీకాంత్
Hero Srikanth Launches Babai Hotel New Branch

బాబాయ్ హోటల్ (Babai Hotel) తెలుగు రాష్ట్రాల్లోని ఫుడ్ లవర్స్‌కు అడ్డాగా మారింది. అద్భుతమైన రుచులతో అన్ని రకాల టిఫిన్స్‌ను అందిస్తోంది. ఈ ఐకానిక్ రెస్టారెంట్ ప్రస్తుతం అన్ని ఏరియాల్లోకి విస్తరిస్తోంది. 2022లో బాబాయ్ హోటల్ హైదరాబాద్‌కు వచ్చింది. గత నెలలో మాదాపూర్‌లో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో బాబాయ్ హోటల్ ఐదవ బ్రాంచ్‌ను ప్రారంభించారు.

*Parineeti chopra: ‘నా ప్రియసఖి పరిణీతి’ అంటూ... తన భావాలకు అక్షర రూపం ఇచ్చాడు 


ఈ క్రమంలో లింగంపల్లిలోని నల్లగండ్ల (Nallagandla)లో తాజాగా బాబాయి హోటల్ న్యూ బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ (Hero Srikanth) ఈ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. బాబాయ్ హోటల్ నిర్వాహకులు కెవి దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి, మరికొందరు అతిథులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Hero-Srikanth.jpg

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. కెవి దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి కలిసి మదీనా గూడ, మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన బాబాయ్ హోటల్ రెండు బ్రాంచ్‌లు విజయ‌వంతంగా సాగుతున్నాయి. ఈ నూతన బ్రాంచ్‌ను నా చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలపగా.. ఈ బ్రాంచ్‌ను ప్రారంభించిన హీరో శ్రీకాంత్‌కు హోటల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 28 , 2024 | 03:01 PM