Parineeti chopra: ‘నా ప్రియసఖి పరిణీతి’ అంటూ... తన భావాలకు అక్షర రూపం ఇచ్చాడు 

ABN , Publish Date - Apr 28 , 2024 | 10:15 AM

పరిణీతి చోప్రా... పాపులర్‌ అవుతున్న సమయంలోనే సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి, ‘ఆప్‌’ నేతతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ప్రసిద్ధ బాలీవుడ్‌ దర్శకుడు ఇంతియాజ్‌ అలీ తీసిన ‘అమర్‌ సింగ్‌ చమ్కీలా’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి... అదిరిపోయే హిట్‌ కొట్టింది. ఈ

Parineeti chopra: ‘నా ప్రియసఖి పరిణీతి’ అంటూ... తన భావాలకు అక్షర రూపం ఇచ్చాడు 
Parineeti Chopra

పరిణీతి చోప్రా(Parineeti Chopra)... పాపులర్‌ అవుతున్న సమయంలోనే సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి, ‘ఆప్‌’ నేతతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ప్రసిద్ధ బాలీవుడ్‌ దర్శకుడు ఇంతియాజ్‌ అలీ తీసిన ‘అమర్‌ సింగ్‌ చమ్కీలా’తో (Amar Singh Chamkila) సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి... అదిరిపోయే హిట్‌ కొట్టింది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ముచ్చట్లివి...

ట్రాఫిక్‌లో ఉండగానే...
‘అమర్‌ సింగ్‌ చమ్కీలా’లో నటించే అవకాశం ఎలా వచ్చిదంటే... రెండేళ్ల క్రితం నేను కరణ్‌ జోహార్‌ పుట్టినరోజు వేడుకకు వెళ్తున్న సమయంలో దర్శకుడు ఇంతియాజ్‌ అలీ నుంచి ఫోన్‌ వచ్చింది. హీరో దిల్జీత్, రెహమాన్‌ సర్‌ కూడా జూమ్‌ కాల్‌లో ఉన్నారు. మీతో ఇప్పుడు మాట్లాడొచ్చా? అని అడిగారు. నిజానికి నేను అప్పుడు కారులో ఉన్నా. ట్రాఫిక్‌లో చిక్కుకున్నా. ‘పాటలు పాడడం వచ్చా?’ అని రెహమాన్‌ అడిగారు. పాడటమంటే నాకు చాలా ఇష్టమని చెప్పా. వెంటనే ‘దమా దమ్‌ మస్త్‌ కలందర్‌’ పాట పాడమన్నారాయన. నేను చాలా జాలీగా పాడేశా. అలా ఆ చిత్రంలోని పాటలన్నీ పాడే అవకాశంతో పాటు అనుకోకుండా నటించే అవకాశం కూడా వచ్చింది. నిజానికి ఆ సినిమాలో నేను పాడిన పాటలే నన్నందులో నటించేలా చేశాయని చెప్పాలి.

Pari-3.jpg

ఆ ఘనత నాదే...
తాజాగా ఒక వేదికపై సంగీత ప్రదర్శన కూడా ఇచ్చాను. ‘అమర్‌ సింగ్‌ చమ్కీలా’ చిత్రీకరణ సమయంలో నా సహనటుడు దిల్జీత నా పాటలు విని లైవ్‌ పర్ఫార్మెన్స్‌ ఇవ్వమని అన్నారు. మావారు కూడా పాడమని ప్రోత్సహించడంతో... మొత్తానికి నాకెంతగానో ఇష్టమైన సంగీత ప్రపంచం లోకి అడుగుపెట్టా. చిత్ర పరిశ్రమలో లైవ్‌ పర్ఫార్మెన్స్‌లు ఇస్తూ, నటించే కథానాయికలు ఎవరూ లేరు. ఆ ఘనత నాకే దక్కిందని చెప్పాలి.


అభిమానులు పలు రకాలు...
అభిమానుల నుంచి అందుకున్న కానుకల్లో ప్రత్యేకమైనవి అంటే మాత్రం... ఓ అభిమాని మా ఇంటికి ఒక స్పెషల్‌ గిఫ్ట్‌ బాక్స్‌ పంపించాడు. తెరిచి చూస్తే... అందులో ఒక జత కమ్మలు, తాజ్‌మహల్‌ మెమొంటోతో పాటు, ఒక రొమాంటిక్‌ ప్రేమలేఖ కూడా ఉంది. ‘నా ప్రియసఖి పరిణీతి’ అంటూ మొదలెట్టి తన మనసులోని భావాలకు అక్షరరూపం ఇచ్చాడు. ఇంకో అభిమానేమో ప్రతీ మూడు నెలలకోసారి ఇంటికొచ్చి బోలెడు బహుమతులు ఇచ్చి పోతుండేవాడు. వాటిని అమ్మ నా గదిలో భద్రంగా దాచి పెట్టేది.

డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా...
2014- 2015 మధ్య కాలంలో ఆర్థికంగా నా పరిస్థితి దారుణంగా ఉండేది. ఆ సమయంలో నేను నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్‌ కావడంతో ఆర్థిక కష్టాలు వెంటాడాయి. రోజూవారీ ఖర్చులకు కూడా చేతిలో డబ్బులు ఉండేవి కావు. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఎవరినీ కలవకుండా ఒంటరిగా గడిపేదాన్ని.

Pari 2.avif

సోషల్‌ మీడియాకు దూరం
పెళ్లి తరువాత సోషల్‌ మీడియా చూడటం మానేశాను. ఒకప్పుడు చాలా సమయం స్మార్ట్‌ఫోన్‌తోనే గడిపేదాన్ని. అయితే ఇప్పుడు నా జీవితంలో సామాజిక మాధ్యమాల పాత్ర ఒక్క శాతం మాత్రమే. పెళ్లైన ఈ ఆరు నెలల్లో నా సమయాన్నంతా మా వారికోసమే కేటాయించా. ఎక్కడికి వెళ్లిన మమ్మల్ని చూసి ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అంటుంటారు. ఆయన రాజకీయ నేత. సినిమాల గురించి అంతగా పట్టించుకోరు. నాకేమో రాజకీయాలపై అవగాహన లేదు. ఒకరి వృత్తిని మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగుతున్నాం.


ఇష్టమైన నటులు: సైఫ్‌ అలీఖాన్‌, ప్రియాంకా చోప్రా. టాలీవుడ్‌లో మహేష్‌బాబు
ముద్దుపేరు: తిషా
ఖాళీ సమయాల్లో: డ్యాన్స్‌ చేస్తుంటా, మ్యూజిక్‌ వింటా.
ఫేవరెట్‌ ఫుడ్‌: రాజ్మా, పిజ్జా, బోన్‌లెస్‌ కడాయి చికెన్‌
నాకున్న చెడ్డ అలవాటు: గోళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని కొరుకుతుంటా.


Read More: Tollywood, Cinema News, Bollywood

Updated Date - Apr 28 , 2024 | 10:15 AM