సోషల్ మీడియాలో మంచితో పాటు చెడూ ఉంది: FCA సత్కార సభలో మీడియా అకాడమీ చైర్మన్

ABN , Publish Date - Mar 22 , 2024 | 04:38 PM

గొంతులేని సామాన్యుల భావ వ్యక్తీకరణకు సోషల్ మీడియా ఎంతో దోహదపడుతుందని, అయితే కొందరు ఇదే అదనుగా భావిస్తూ.. హద్దు, అదుపు లేకుండా స్వేచ్ఛ పేరిట ఉచ్ఛరించడానికి వీలుకాని భాషను ఉపయోగిస్తున్నారని, ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి. శుక్రవారం ఫిల్మ్ క్రిటిక్స్ అసోషియేషన్ సన్మాన సభలో ఆయన ప్రసంగించారు.

సోషల్ మీడియాలో మంచితో పాటు చెడూ ఉంది: FCA సత్కార సభలో మీడియా అకాడమీ చైర్మన్
Telangana Media Academy Chairman K Sreenivas Reddy Felicitation Event

గొంతులేని సామాన్యుల భావ వ్యక్తీకరణకు సోషల్ మీడియా ఎంతో దోహదపడుతుందని, అయితే కొందరు ఇదే అదనుగా భావిస్తూ.. హద్దు, అదుపు లేకుండా స్వేచ్ఛ పేరిట ఉచ్ఛరించడానికి వీలుకాని భాషను ఉపయోగిస్తున్నారని, ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ (Telangana Media Academy Chairman) కె. శ్రీనివాస్ రెడ్డి (K Sreenivas Reddy). శుక్రవారం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో టీయూడబ్ల్యూజే అనుబంధ సంస్థ అయిన ఫిల్మ్ క్రిటిక్స్ (సినిమా బీట్ జర్నలిస్టుల) అసోసియేషన్ (Film Critics Association) నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘నీతి, నిజాయితీ, నిర్భీతితో పనిచేస్తూ, ప్రజల గొంతుకగా నిలబడే మీడియా సంస్థలకు, జర్నలిస్టులకు తాత్కాలికంగా కష్టాలు ఎదురైనా, భవిష్యత్తులో ఖచ్చితంగా మంచిరోజులే ఉంటాయి. మీడియాను తమ చేతుల్లోకి తీసుకుంటున్న బడా వ్యాపార, వాణిజ్య వేత్తలు వృత్తి ధర్మాన్ని విస్మరిస్తూ, ఇష్టానుసారంగా వ్యవహరించడం సహించరానిది. దాదాపు ఆరు దశబ్దాల నుండి పనిచేస్తున్న ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌ (FCA)కు నాటి నుండి నేటి వరకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నాం. నాడు దేశోద్దారక భవన నిర్మాణానికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించిన సహకారం చిరస్మరణీయం. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారు.. ఎన్నికల నోటిఫికేషన్ ముగిసిన వెంటనే సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి‌తో నేనూ సమావేశమై.. దశల వారీగా వీలైనంత తొందరలో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను’’ అని తెలిపారు. (FCA Felicitates Telangana Media Academy Chairman K Sreenivas Reddy)


suresh-Kavirayani.jpg

దర్శకనిర్మాత తమ్మిరెడ్డి భరద్వాజా (Thammareddy Bharadwaja) మాట్లాడుతూ.. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీకీ తొలి చైర్మన్‌గా సమర్థవంతంగా సేవలను అందించి, నేడు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్‌గా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆ పదవికి మరింత గౌరవం పెరిగిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ (K Virahat Ali) మాట్లాడుతూ.. తమ సంఘానికి ఎంత చరిత్ర ఉందో.. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌కు అంతే చరిత్ర ఉందన్నారు. నాటి నుండి నేటి వరకు తమ సంఘానికి అనుబంధంగా పని చేస్తూ, సినిమా బీట్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కృషి చేయడం అభినందనీయమన్నారు.

K-Sreenivas-Reddy.jpg

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు (Prabhu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీర శంకర్ (Veera Shankar), ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ (Prasanna Kumar), ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ ( K Satyanarayana), వయోధిక జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ రావు (Lakshman Rao), ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేష్, లక్ష్మీనారాయణ.. సహాయ కార్యదర్శి అబ్దుల్, కోశాధికారి హేమసుందర్, ఈసీ మెంబర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Om Bheem Bush Movie Review: కాసేపు నవ్వుకోవచ్చు

********************************

*Thandel: ఇంటెన్స్, ప్యాషన్ నిండిన ఆహ్లాదకరమైన వాతావరణంలో టీమ్.. ఫొటోలు వైరల్

********************************

*Allu Arjun: మరో రికార్డ్ బద్దలైంది.. ఐకాన్‌స్టార్‌ని ఆపతరమా..

************************

*Thalakona: కశ్మీర్ యాపిల్‌‌లా ఉండే అప్సరా రాణి.. కశ్మీర్ మిర్చి‌లా..

*********************

Updated Date - Mar 22 , 2024 | 04:38 PM