Suriya: ఈ యేడాది విడుదలకానున్న సూర్య రెండు చిత్రాలు

ABN , Publish Date - Mar 21 , 2024 | 10:33 AM

ఈ యేడాది హీరో సూర్య నటించే రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి. వీటిలో ఒకటి ‘కంగువ’. చిరుత్తై శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం చివరి దశ నిర్మాణ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఆ తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించే 43వ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘పురనానూరు’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా, జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించనున్నారు.

Suriya: ఈ యేడాది విడుదలకానున్న సూర్య రెండు చిత్రాలు
Suriya in Kanguva Movie

ఈ యేడాది హీరో సూర్య (Suriya) నటించే రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి. వీటిలో ఒకటి ‘కంగువ’ (Kanguva). చిరుత్తై శివ (Director Siva) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం చివరి దశ నిర్మాణ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈమూవీని జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించే 43వ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘పురనానూరు’ (Purananooru) అనే టైటిల్‌ను ఖరారు చేయగా, జీవీ ప్రకాష్‌ కుమార్‌ (GV Prakash Kumar) సంగీతం అందించనున్నారు.

Suriya-2.jpg

సూర్య - సుధ కొంగర కాంబినేషన్‌లో వచ్చిన ‘సూరరైపోట్రు’ (Soorarai Pottru) ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్టు మాత్రం కాస్త ఆలస్యంకానుందని హీరో సూర్య (Kollywood Star Hero Suriya) అధికారికంగా వెల్లడించారు. అయినప్పటికీ ఈ యేడాది ఆఖరునాటికి ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ నిర్మాణ పనులు జరుపుకుంటోంది.


Karna.jpg

అలాగే, హిందీలో కూడా సూర్య నటించే ‘కర్ణ’ (Karna) ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలన్న ఆలోచనలో సూర్య ఉన్నారు. కాగా.. ‘కంగువ’ మూవీ టీజర్‌ను మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ మంచి స్పందనను రాబట్టుకుంటూ.. సినిమాపై క్రేజ్‌ని పెంచేస్తోంది. సూర్య కెరీర్‌లో మరో వైవిధ్య చిత్రంగా ఈ ‘కంగువ’ నిలుస్తుందనే ఫీల్‌ని ఈ టీజర్ కలిగిస్తోంది. అందుకు నిదర్శనం.. ఈ టీజర్ విడుదలై రెండు రోజులు అవుతున్నా.. ఇంకా టాప్‌లోనే ట్రెండ్ అవుతుండటం.


ఇవి కూడా చదవండి:

====================

*Ilaiyaraaja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. అధికారిక ప్రకటన వచ్చేసింది

************************

*RC16: ఘనంగా ‘RC16’ ప్రారంభం.. ఫొటోలు వైరల్

********************************

*Ashwatthama: ‘హనుమాన్’ వంటి మరో చిరంజీవి కథ.. హీరో ఎవరంటే?

***************************

Updated Date - Mar 21 , 2024 | 10:33 AM