మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RRR: జక్కన్నపై మరోసారి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ప్రశంసలు

ABN, Publish Date - Feb 07 , 2024 | 02:32 PM

దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఆస్కార్ అవార్డ్ వేదికపై పలువురు హాలీవుడ్ దిగ్గజాలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. వారిలో దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ కూడా ఒకరు. తాజాగా ఆయన మరోసారి రాజమౌళిని ప్రశంసించారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

James Cameron About SS Rajamouli

దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంపై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఆస్కార్ అవార్డ్ వేదికపై పలువురు హాలీవుడ్ దిగ్గజాలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. వారిలో దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron).. ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి ఆశ్చర్యపోయినట్లుగా చెప్పుకొచ్చారు. అంతేకాదు, రాజమౌళిని షేక్‌స్పియర్‌తో పోల్చారు. రాజమౌళి కూడా జేమ్స్ కామెరూన్‌ని కలవడంపై స్పందించారు. ‘కలో.. నిజమో అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. నేను డైరెక్ట్ చేసిన సినిమాను అంతటి దిగ్గజ దర్శకుడు విశ్లేషించడాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అని రాజమౌళి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇప్పుడు మరోసారి రాజమౌళిపై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు కురిపించడంతో.. ఆర్ఆర్ఆర్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలలోకి వెళితే.. తాజాగా 51వ వార్షిక శాటర్న్ అవార్డుల (51st Annual Saturn Awards) వేడుకను అమెరికాలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో జేమ్స్ కామెరూన్.. రాజమౌళి ప్రస్తావన తెచ్చారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఇండియన్ దర్శకుడు రాజమౌళి అద్భుతం చేశారు. ఆయనని కలవడం ఎప్పటికీ మరిచిపోలేను. ప్రపంచవేదికపై ఇండియన్‌ సినిమాను చూడడం హ్యాపీగా అనిపించిందని.. జేమ్స్ కామెరూన్ చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.


ఈ వీడియో చూసిన భారతీయులందరూ.. మరోసారి రాజమౌళి (Rajamouli)కి థ్యాంక్స్ చెబుతున్నారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ పటంపై నిలపడమే కాకుండా.. హాలీవుడ్‌కు చెందిన దిగ్గజ దర్శకులను సైతం మెప్పించిన జక్కన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌తో రాజమౌళి పేరు మరోసారి టాప్‌లో ట్రెండ్ అవుతోంది. రాజమౌళి విషయానికి వస్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu)‌తో ఆయన ‘ఇండియానా జోన్స్’ తరహా చిత్రానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా వివరాలను రాజమౌళి అధికారికంగా ప్రకటించనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Varun Tej: ఫస్ట్ లావణ్య.. తర్వాత ఆ హీరోయిన్ అంటే ఇష్టం

**************************

*Rashmika Mandanna: ఏం చేయను.. మీడియా అలా రాస్తోందని చెబుతా..

******************************

*Kavya Thapar: గోపీచంద్, శ్రీను వైట్ల కాంబో మూవీ టైటిల్ లీక్ చేసిన ‘ఈగల్’ భామ

************************

*Sai Pallavi: సాయి పల్లవి సినిమా రీ రిలీజ్.. లేడీ పవర్ స్టార్ అని అనేది అందుకే..

*****************************

Updated Date - Feb 07 , 2024 | 02:32 PM