Tillu Square: అనుపమ అందాల పవర్‌.. హాట్ కేక్‌లా అమ్ముడైన ఓటీటీ రైట్స్

ABN , Publish Date - Feb 21 , 2024 | 08:23 PM

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ హీరోహీరోయిన్లుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తోన్న చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’. మల్లిక్‌రామ్‌ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రికార్డ్ ప్రైస్‌కు అమ్ముడయినట్లుగా తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కులను రూ. 35 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Tillu Square: అనుపమ అందాల పవర్‌.. హాట్ కేక్‌లా అమ్ముడైన ఓటీటీ రైట్స్
Tillu Square Movie Stills

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) హీరోహీరోయిన్లుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తోన్న చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). మల్లిక్‌రామ్‌ దర్శకుడు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రికార్డ్ ప్రైస్‌కు అమ్ముడయినట్లుగా తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కులను రూ. 35 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే మాత్రం ఈ మధ్యకాలంలో ఏ యంగ్ హీరోకి లేని రికార్డ్‌ను సిద్ధు జొన్నలగడ్డ క్రియేట్ చేసినట్లే. (Tillu Square OTT Rights)

ఎలా అంటే, ఈ మధ్య కాలంలో ఏ కుర్ర హీరో చిత్రానికీ ఈ రేంజ్‌లో హక్కులు అమ్ముడవలేదు. ‘డీజే టిల్లు’ సక్సెస్‌ తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌‌పై మంచి అంచనాలు అయితే ఉన్నాయి కానీ.. ఈ రేంజ్‌లో ఓటీటీ హక్కులు అమ్ముడవుతాయని మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. అందుకు కారణం మాత్రం అనుపమ అందాలే అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిలా కనిపించిన అనుపమ.. ఈ సినిమా విషయంలో మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోయి కనిపిస్తోంది. ప్రేమికుల రోజున విడుదలైన ట్రైలర్‌లో ఆ విషయం స్పష్టంగా తెలిసిపోయింది. ట్రైలర్ తర్వాత ఈ సినిమా స్వరూపమే మారిపోయింది. అది ఇలా హక్కుల రూపంలో కనిపిస్తోంది. (Tillu Square Movie)


Tillu-Square.jpg

సిద్ధు జొన్నలగడ్డ కూడా తనదైన నటనతో మరోసారి సినిమాపై అంచనాలను పెంచేశారు. ట్రైలర్‌లో ఆయన చెప్పే ఒక్కో డైలాగ్.. కిర్రాక్ అన్నట్లుగా ఉంది. మొత్తంగా అయితే.. ఓటీటీ రైట్స్‌తో ‘టిల్లు స్క్వేర్’ మరోసారి వార్తలలో వైరల్ అవుతోంది. మార్చి 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ట్రైలర్‌తో ఇంత హీట్ పుట్టించిన అనుపమ.. సినిమాలో ఇంకేం చేసి ఉంటుందో తెలియాలంటే మాత్రం.. మార్చి 29 వరకు వెయిట్ చేయక తప్పదు.


ఇవి కూడా చదవండి:

====================

*Varun Tej: ‘జనసేన’పై వరుణ్ తేజ్.. ఆసక్తికర వ్యాఖ్యలు

*****************************

*Kanguva: ‘కంగువ’ అప్డేట్ వచ్చింది..

************************

*Nikhil and Pallavi: పేరెంట్స్‌గా ప్రమోషన్.. చంటిబిడ్డతో నిఖిల్ ఫొటో వైరల్

******************************

*DPIFFA 2024: ఈ అవార్డ్ అంటే ఎంతో ఇష్టం.. ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న షారుక్ స్పందనిదే..

***********************************

Updated Date - Feb 21 , 2024 | 08:23 PM