Prabhas: ప్రభాస్ డూప్ కి భారీ డిమాండ్, పారితోషికం కూడా కోట్లలో అని టాక్

ABN , Publish Date - Feb 21 , 2024 | 02:59 PM

అగ్ర నటుల్లో ఒకరైన ప్రభాస్ బాడీ డబుల్ (డూప్) కి భారీ డిమాండ్ ఉందని పరిశ్రమలో టాక్ నడుస్తోంది, వార్తలు కూడా వచ్చాయి. ఈ బాడీ డబుల్ ఒక్క రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటారో తెలిస్తే షాకవుతారు.

Prabhas: ప్రభాస్ డూప్ కి భారీ డిమాండ్, పారితోషికం కూడా కోట్లలో అని టాక్
Prabhas

చాలామంది నటీనటులు పోరాట సన్నివేశాలు చేసేటప్పుడు తమకి బదులుగా తమ బాడీ డబుల్ ను (డూప్) ఉపయోగించటం మొదటినుండీ చిత్రపరిశ్రమలో వున్న విషయమే. అయితే అప్పట్లో ఈ డూప్ లకి అంతగా డిమాండ్ లేదేమో కానీ, ఇప్పుడు మాత్రం ప్రభాస్ తరపున చేస్తున్న అతని డూప్ లకి బాగా డిమాండ్ వుంది అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. ఈ విషయం ఇప్పుడు ఒక పెద్ద టాపిక్ అయింది అని కూడా అంటున్నారు. (Big demand for Prabhas' body double)

ప్రభాస్ ఎక్కువగా పోరాట సన్నివేశాలుండే సినిమాలు చెయ్యడంతో అతనికి కొంచెం నడుము నొప్పి వచ్చిందని, అందుకని ఈ బాడీ డబుల్ ని ఎక్కువగా వాడుతున్నారని వార్తలు వచ్చాయి. 'సలార్' సినిమాలో కూడా ఈ బాడీ డబుల్ ని వాడారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ప్రభాస్ ఎక్కువ పారితోషికం తీసుకునే పాన్ ఇండియన్ నటుల్లో ఒకరు, వెండితెరపై అతని కట్ అవుట్ చూస్తే చాలు, అభిమానులు ఆనందంతో ఊగిపోతారు, అంత క్రేజ్ వున్న నటుడు ప్రభాస్. (Prabhas body double is getting high remuneration)

Prabhas-Salaar-1.jpg

ఇప్పుడు ప్రభాస్ 'రాజాసాబ్', 'కల్కి 2898 ఎడి' సినిమాలు షూటింగ్ జరుగుతూ వున్నాయి, ఇంకా కొన్ని సినిమాలు ఒప్పుకున్నారు కూడా. అయితే ఇప్పుడు ప్రభాస్ బాడీ డబుల్ కి మంచి డిమాండ్ ఉండటంతో అతను ఒక్క రోజుకి పారితోషికం రూ. 30 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. (Prabhas body double is charging Rs 30 lakh per day as remuneration) ఆ బాడీ డబుల్ కి సుమారు ఒక 30 రోజులవరకు పని ఉంటుందని, ఇలా ఎక్కువ పారితోషికం డిమాండ్ చెయ్యడంతో వాళ్ళకి కూడా నిర్మాత కోట్లలో పారితోషికం చెల్లించాల్సి వస్తోందని ఒక చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఒక్క బాడీ డబుల్ కాదు, ఇద్దరు వున్నారు అని కూడా ఇంకో చర్చ నడుస్తోంది. చాలామంది తమకి బదులు బాడీ డబుల్ ని వాడుతున్నా, ఎందుకో ఇప్పుడు ప్రభాస్ బాడీ డబుల్ గురించే ఎక్కువ చర్చ పరిశ్రమలో నడుస్తోంది.

ఇది కూడా చదవండి:

Salaar movie review: ఇది కేవలం ప్రభాస్ అభిమానులకి మాత్రమే!

The Raja Saab: ప్ర‌భాస్ మారుతి సినిమా ‘ది రాజా సాబ్’ .. అదిరిపోయిన ఫ‌స్ట్ లుక్

Updated Date - Feb 21 , 2024 | 02:59 PM