The Raja Saab: ప్ర‌భాస్ మారుతి సినిమా ‘ది రాజా సాబ్’ .. అదిరిపోయిన ఫ‌స్ట్ లుక్

ABN , Publish Date - Jan 15 , 2024 | 07:20 AM

రెబల్ స్టార్ ప్రభాస్ , డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌ లో వ‌స్తున్న చిత్రం నుంచి ఎట్ట‌కేల‌కు అప్డేట్ వ‌చ్చింది. ఇప్ప‌టికే ‘కల్కి 2898AD’ చిత్రం విడుద‌ల తేదీని అధికారికంగా ప్ర‌క‌టించి స‌ర్‌ఫ్రైజ్ చేయ‌గా తాజాగా శనివారం ప్రభాస్ నటిస్తోన్న మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ వద‌ల‌గా ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు.

The Raja Saab: ప్ర‌భాస్ మారుతి సినిమా ‘ది రాజా సాబ్’ .. అదిరిపోయిన ఫ‌స్ట్ లుక్
prabhas

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌ (Prabhas and Maruthi Combo) లో వ‌స్తున్న చిత్రం నుంచి ఎట్ట‌కేల‌కు అప్డేట్ వ‌చ్చింది. ఇప్ప‌టికే ‘కల్కి 2898AD’ చిత్రం విడుద‌ల తేదీని అధికారికంగా ప్ర‌క‌టించి ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అభిమానుల‌ను స‌ర్‌ఫ్రైజ్ చేయ‌గా తాజాగా శనివారం ప్రభాస్ నటిస్తోన్న మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ వద‌ల‌గా ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. అంతేకాకుండా సోష‌ల్ మీడియాలో రెబల్‌స్టార్ పేరు ప్ర‌భాస్ పొంగ‌ల్ ఫెస్ట్ పేరిట ( PrabhasPongalFeast) బాగా ట్రెండ్ అయ్యింది. అంతేకాకుండా ఫస్ట్‌ లుక్‌ లాంఛ్ సందర్భంగా ప్రభాస్ అభిమానులు భారీ ఎల్‌ఈడీ డిజిటల్‌ కటౌట్‌ను రెడీ చేశారు. ఈ ఏర్పాట్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ప్ర‌స్తుతం రాజా డీలక్స్‌ (వర్కింగ్‌ టైటిల్‌)తో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ హార్రర్‌, కామెడీ, రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15న ఉదయం 7గంటల 08 నిమిషాలకు విడుదల చేస్తున్నామ‌ని రెబల్‌ స్టార్ నయా అవతార్‌ను ఈ సంక్రాంతికి చూపించబోతున్నాం అన్నారు. డైనోసార్‌.. పక్కా డార్లింగ్‌గా ట్రాన్స్ ఫర్మేషన్‌ అయిన లుక్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సగర్వంగా లాంఛ్ చేస్తున్నదని ఇప్పటికే ట్వీట్ చేశారు. సంక్రాంతి రోజు ఉదయించే సూర్యుడితో పాటు.. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా డబుల్ ట్రీట్‌తో సిద్ధమవుతున్నాడని తెలుపుతూ.. టైమ్‌ని తెలిపేందుకు సింబాలిక్‌గా కోడిపుంజు కూస్తున్న పోస్టర్‌ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.


మేకర్స్ చెప్పిన‌ట్లుగానే ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్‌ను సంక్రాంతి స్పెషల్‌గా ఈ రోజు (సోమ‌వారం) జనవరి 15న ఉదయం 7గంటల 08 నిమిషాలకు అధికారికంగా విడుదల చేశారు. సినిమా పేరును రాజా సాబ్ గా ప్ర‌క‌టిస్తూ ప్ర‌భాస్ లుంగీతో ఉన్న లుక్‌ను విడుద‌ల చేశారు. ఇప్పుడు ఈ లుక్ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. స‌లార్‌లో ప్ర‌భాస్ లుక్‌కు ఇది చాలా భిన్నంగా ఉంద‌ని, ఫ్యామిలీ లుక్స్‌లో వింటేజ్ ప్ర‌భాస్‌ను చూసినట్టుగా ఉంద‌ని అభిమానులు హ్యఫీగా ఫీల‌వుతున్నారు.

(#PrabhasMaruthi) ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యాన‌ర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాళవికా మోహనన్‌ (Malavika Mohanan), రిద్ది కుమార్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు.. ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటి వరకు కనిపించని ఓ కొత్త లుక్‌లో, క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడని మేకర్స్ చెబుతున్నారు.

Updated Date - Jan 15 , 2024 | 07:33 AM