Namo: సర్వైవల్ కామెడీ చిత్రానికి విడుదల తేదీ ఫిక్సయింది

ABN , Publish Date - May 26 , 2024 | 05:52 PM

సర్వైవల్ కామెడీ జానర్‌లో పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘నమో’. విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా.. విస్మయ శ్రీ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఏ ప్రశాంత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీని జూన్ 7న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు.

Namo: సర్వైవల్ కామెడీ చిత్రానికి విడుదల తేదీ ఫిక్సయింది
Namo Movie Poster

సర్వైవల్ కామెడీ జానర్‌లో పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘నమో’ (Namo Movie). విశ్వంత్ దుద్దంపూడి (Viswant Duddumpudi), అనురూప్ కటారి (Anuroop Katari) హీరోలుగా.. విస్మయ శ్రీ (Vismaya Sri) హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఏ ప్రశాంత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు (Aditya Reddy Kunduru) దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీని జూన్ 7న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. (Namo Movie Release Date)

*STR 48: శింబు చిత్రంలో.. జాన్వీ, కియారా! నిజంగా ఒప్పుకున్నారా..


Namo-Movie.jpg

విశ్వంత్, అనురూప్ కాంబోలో హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రొమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విడుదల తేదీని రివీల్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్టర్‌లో హీరోలిద్దరూ వింత ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి కనిపిస్తుండగా.. బ్యాగ్రౌండ్‌లో హీరోయిన్ నవ్వుతూ ఉంది. పోస్టర్ డిజైన్ ఇన్నోవేటివ్‌గా ఉంది. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు క్రాంతి ఆచార్య వడ్లూరి మ్యూజిక్ డైరెక్టర్2గా, సనల్ అనిరుధన్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. (Namo Telugu Movie)

Read Latest Cinema News

Updated Date - May 26 , 2024 | 05:52 PM