Nandamuri Balakrishna: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన బాల‌కృష్ణ‌

ABN , Publish Date - May 26 , 2024 | 01:49 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన బాల‌కృష్ణ‌ ఈ రోజు (ఆదివారం) ఉద‌యం ఆయ‌న నివాసంలో నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

Nandamuri Balakrishna: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన బాల‌కృష్ణ‌
nbk

తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని ఈ రోజు (ఆదివారం) ఉద‌యం ఆయ‌న నివాసంలో నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు పుష్ఫ‌గుచ్చం అంద‌జేశారు.

ఈ స‌మ‌యంలో బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) వెంట బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి (Basavatarakam Hospita.) ట్ర‌స్ట్ స‌భ్యులు డాక్ట‌ర్ కృష్ణ‌య్య (Dr. K. Krishnaiah), శివ‌రాంప్ర‌సాద్ (J. Siva Rama Prasad) ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆస్ప‌త్రికి సంబంధించిన‌ కొన్ని విష‌యాల‌ను చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.


GOfGjXJXMAAacEu.jpeg

అయితే.. ఇటీవ‌లే ఎన్నిక‌ల హ‌డావుడి అనంత‌రం కాస్త విశ్రాంతి తీసుకున్న బాల‌కృష్ణ ఇప్పుడే మ‌ళ్లీ బ‌య‌టి కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ ఉన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం కాజ‌ల్ న‌టించిన స‌త్య‌భామ ఈవెంట్లో పాల్గొన్న బాల‌య్య మ‌ళ్లీ తాజాగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. ఈ క‌ల‌యిక‌కు సంబంధ‌ఙంచిన పూర్తి విష‌యాలు తెలియాల్సి ఉంది.

Updated Date - May 26 , 2024 | 09:00 PM