Rathnam: విశాల్ ‘రత్నం’ సెన్సార్ టాక్ ఏంటంటే..

ABN , Publish Date - Apr 25 , 2024 | 02:34 PM

యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘రత్నం’. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘భరణి, పూజ’ వంటి యాక్షన్ మూవీస్ వచ్చి ప్రేక్షకుల్ని అలరించాయి. ఇక ఇప్పుడు మూడో సారి ‘రత్నం’తో ఈ కాంబో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 26న విడుదలకు అన్ని రకాలుగా సిద్ధమైంది.

Rathnam: విశాల్ ‘రత్నం’ సెన్సార్ టాక్ ఏంటంటే..
Vishal in Rathnam Movie

యాక్షన్ హీరో విశాల్ (Vishal), మాస్ డైరెక్టర్ హరి (Director Hari) కాంబోలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘రత్నం’ (Rathnam). ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘భరణి (Bharani), పూజ (Pooja)’ వంటి యాక్షన్ మూవీస్ వచ్చి ప్రేక్షకుల్ని అలరించాయి. ఇక ఇప్పుడు మూడో సారి ‘రత్నం’తో ఈ కాంబో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాత. శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్‌లో ఏప్రిల్ 26న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. విడుదలకు అన్ని రకాలుగా ముస్తాబైంది. (Rathnam Censor Details)

*Bhimaa: ఓటీటీలోకి వచ్చేసిన ‘భీమా’.. ఇక్కడైనా..!!


సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమా పాజిటివ్ స్పందనను రాబట్టుకున్నట్లుగా తెలుస్తోంది. యూ/ఏ సర్టిఫికెట్‌‌తో పాటు.. ఈ మూవీలో యాక్షన్‌తో పాటు చక్కని సందేశం ఉందని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని ఈ మేరకు సెన్సార్ సభ్యులు కొనియాడినట్లుగా మేకర్స్ తెలుపుతున్నారు (Rathnam Censor Talk). ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి.


Vishal-Rathnam.jpg

రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘ఎటువైపో ఎటువైపో..’ అనే పాట ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. సంగీత సంచలనం దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad), విశాల్ (Vishal) కాంబోలో ‘రత్నం’ మొదటి సినిమా కావడంతో మ్యూజిక్ లవర్స్ దృష్టి ఈ సినిమాను ఆకర్షించింది. ఇక ఏప్రిల్ 26 రాబోతోన్న ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందనను రాబట్టుకుంటుందో వెయిట్ అండ్ సీ..

Read Latest Cinema News

Updated Date - Apr 25 , 2024 | 02:34 PM