Vishal: ‘రత్నం’.. పైసా వసూల్ సినిమా..

ABN , Publish Date - Apr 20 , 2024 | 10:22 PM

విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రత్నం’. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కె రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 26న విడుదలకాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా విశాల్ ఈ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు.

Vishal: ‘రత్నం’.. పైసా వసూల్ సినిమా..
Hero Vishal

విశాల్ (Vishal), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోహీరోయిన్లుగా జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రత్నం’ (Rathnam). కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి (Director Hari) ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్ (CH Satish Kumar), కె రాజ్ కుమార్ (K Raj Kumar) సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 26న విడుదలకాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో విశాల్ పాల్గొన్నారు.

*Harish Shankar: మళ్లీ కెలుక్కుంటాను అంటే.. రా చూసుకుందాం.. కెమెరామెన్‌ చోటకు హరీష్ వార్నింగ్


ఈ కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ (Hero Vishal about Rathnam).. ‘‘19 ఏళ్ల నా కెరీర్‌లో నాకు ఎందరో సపోర్ట్‌గా నిలిచారు. మా డాక్టర్ ఏది చేయొద్దంటే అదే చేస్తుంటాను. ‘వాడు వీడు’ టైంలో మెల్లకన్ను పెట్టి నటించొద్దని అన్నారు.. కానీ నేను వినలేదు. నా శరీరంలో ఇప్పుడు వంద కుట్లున్నాయి. మా డాక్టర్ అలా చెప్పి చెప్పి విసిగిపోయారు. నేను ఆయన మాట వినకుండా ఫీట్స్ చేస్తూనే ఉన్నాను. నన్ను నమ్మి డబ్బులు పెట్టేందుకు వచ్చిన నిర్మాత బాగుండాలనే ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. హరి గారితో ‘భరణి, పూజ’ చేశాను. అవి పెద్ద హిట్లు అయ్యాయి. ‘రత్నం’ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోంది. సతీష్ గారు ఈ సినిమాను తీసుకున్నందుకు థాంక్స్. అందరికీ ఈ చిత్రంతో లాభాలు రావాలి. ఏప్రిల్ 26న మా మూవీ రాబోతోంది. నేను చివరి నిమిషం వరకు సినిమాను ప్రమోట్ చేస్తాను. అది నా బాధ్యత. దేవీ శ్రీ ప్రసాద్ మంచి సంగీతం, ఆర్ఆర్ ఇచ్చారు. డైలాగ్ రైటర్ రాజేష్ వల్ల ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమాలా అనిపిస్తుంది. మాతో కలిసిన ఆదిత్య మ్యూజిక్‌కు థాంక్స్. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. హరి గారి చిత్రంలో హీరో కంటే హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రియా భవానీ శంకర్ కారెక్టర్ ఈ సినిమాకు ప్రాణం. మీరు పెట్టే డబ్బులకు సరిపడా వినోదం ఇస్తాం. కచ్చితంగా పైసా వసూల్ (Paisa Vasool) సినిమా అవుతుంది’’ అని తెలిపారు.


Vishal.jpg

డిస్ట్రిబ్యూటర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘విశాల్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే ‘రత్నం’ చిత్రాన్ని తీసుకున్నాను. హరి (Hari) చిత్రాలంటే అలా పరిగెడుతూనే ఉంటాయి. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఏప్రిల్ 26న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన హీరో విశాల్‌కి థాంక్స్’’ అని అన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 10:22 PM