Aparichithudu Re Release: అపరిచితుడు’ రీ రిలీజ్.. క్రేజీగా అడ్వాన్స్ బుకింగ్

ABN , Publish Date - May 15 , 2024 | 03:21 PM

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ నిర్మాత వి రవిచంద్రన్ కాంబినేషన్‌లో విక్రమ్, సదా నటించిన చిత్రం ‘అపరిచితుడు’. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథా నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో రిలీజై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా విక్రమ్‌ను స్టార్ హీరోగా, కమర్షియల్ హీరోగానూ మార్చింది. ఈ చిత్రం మే 17న రీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది.

Aparichithudu Re Release: అపరిచితుడు’ రీ రిలీజ్.. క్రేజీగా అడ్వాన్స్ బుకింగ్
Aparichithudu Movie Still

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Shankar), ప్రముఖ నిర్మాత వి రవిచంద్రన్ కాంబినేషన్‌లో విక్రమ్ (Vikram), సదా (Sadha) నటించిన చిత్రం ‘అపరిచితుడు’ (Aparichithudu). ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథా నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో రిలీజై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా విక్రమ్‌ను స్టార్ హీరోగా, కమర్షియల్ హీరోగానూ మార్చింది. ప్రస్తుతం రీ రిలీజ్‌ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను మే 17వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ప్రస్తుతం తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ఈ సినిమా రీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వగా మంచి స్పందన కనిపిస్తుందని.. ఎన్నికల తర్వాత సరైనా సినిమా థియేటర్‌లో లేకపోవడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తుందని ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్న నిర్మాతలు ఆశిస్తున్నారు. (Aparichithudu Ready to Re Release)

*Vidya Vasula Aham: ‘విద్య వాసుల అహం’ మూవీ ట్రైలర్


‘అపరిచితుడు’ సినిమా విషయానికి వస్తే.. ఆస్కార్ సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 60 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఈ చిత్రం ఆ ఏడాది రిలీజైన అన్ని చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విక్రమ్, ప్రకాశ్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు హై ఓల్టేజ్‌ను అందించాయి. విక్రమ్ (Vikram) నటనా విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడగలిగారు. రామం, రెమో, అపరిచితుడు.. ఇలా మూడు షేడ్స్‌లో విక్రమ్ నటనకు జనాలు నీరాజనాలు పలికారు.


Vikram.jpg

ఈ సినిమాకు హ్యారీష్ జైరాజ్ (Harris Jayaraj) అందించిన మ్యూజిక్‌కు హైలెట్‌గా నిలిచింది. ఆయన రూపొందించిన పాటలు చార్ట్‌బస్టర్‌‌లో బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ సాంగ్స్ ఇప్పటికీ కుర్రకారును ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. ఇలాంటి విశిష్టత కలిగిన ఈ సినిమా రీ రిలీజ్ కోసం.. ఎప్పటి నుండో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడా సమయం వచ్చేసింది. ఈ రీ రిలీజ్‌లో మరోసారి ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల పంటను పండిస్తుందని ట్రేడ్ వర్గాలు సైతం వెల్లడిస్తుండటం విశేషం. (Aparichithudu Movie)

Read Latest Cinema News

Updated Date - May 15 , 2024 | 04:40 PM