Goundamani: సుప్రీంకోర్టులో సీనియర్‌ హాస్య నటుడు గౌండమణికి ఊరట

ABN , Publish Date - May 15 , 2024 | 02:38 PM

సీనియర్‌ హాస్య నటుడు గౌండమణికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొత్తం స్థలాన్ని అప్పగించడంతో పాటు 2008 ఆగస్టు నుంచి ప్రతి నెల రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయగా.. పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది.

Goundamani: సుప్రీంకోర్టులో సీనియర్‌ హాస్య నటుడు గౌండమణికి ఊరట
Goundamani

సీనియర్‌ హాస్య నటుడు గౌండమణి (Goundamani)కి సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే కోడంబాక్కం ఆర్కాడ్‌ రోడ్డులో 1996 సంవత్సరంలో నిన్నిభాయ్‌ అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని గౌండమణి కొనుగోలు చేసి, ఒక భవన నిర్మాణ కంపెనీకి లీజుకు ఇచ్చారు. అందులో 22,700 చదరపుటడుగుల విస్తీర్ణంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ను 15 నెలల్లో నిర్మించేందుకు, ఇందుకోసం రూ.3.58 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. (Goundamani Property Dispute Case)

*Nayanthara: అక్క పాత్రకు అంత రెమ్యునరేషనా?


Goundamani-2.jpg

ఇందుకోసం 1996 నుంచి 1999 వరకు నిర్మాణ కంపెనీకి రూ.1.04 లక్షలు కూడా చెల్లించారు. కానీ, 2003 వరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ఆ కంపెనీ నిర్మించలేదు. దీంతో గౌండమణి హైకోర్టుకు వెళ్ళగా, మొత్తం స్థలాన్ని అప్పగించడంతో పాటు 2008 ఆగస్టు నుంచి ప్రతి నెల రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయగా, ఈ పిటిషన్‌పై న్యాయమూర్తుల పర్తివాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం... రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ పిటిషన్‌ను కొట్టివేసింది.

Read Latest Cinema News

Updated Date - May 15 , 2024 | 02:38 PM