మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. ఫస్ట్ లుక్ ఇదే..

ABN, Publish Date - Mar 08 , 2024 | 01:39 PM

ఓటీటీ చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కి సీక్వెల్ అయిన ‘ఓదెల 2’ చిత్రం ఇటీవలే కాశీలో గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది క్రియేటర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి మధు హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ చిత్రంలో శివశక్తి పాత్రలో నటిస్తున్న తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Tamannaah Bhatia in Odela 2

ఓటీటీ చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ (Odela Railway Station) కి సీక్వెల్ అయిన ‘ఓదెల 2’ (Odela 2) చిత్రం ఇటీవలే కాశీలో గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. అశోక్ తేజ (Director Ashok Teja) దర్శకత్వంలో సంపత్ నంది (Sampath Nandi) క్రియేటర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి మధు హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి (Maha Shivratri) పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ చిత్రంలో శివశక్తి పాత్రలో నటిస్తున్న తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాత్ర కోసం తమన్నా కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. నాగ సాధువులా వేషం ధరించి.. ఒక దండము, మరో చేతిలో ఢమరుకం, నుదుటిపై పసుపు బొట్టు, దానిపై కుంకుమ బిందువుతో శివశక్తిగా అద్భుతం అనేలా తమన్నా దర్శనమిస్తోంది.

కాశీ ఘాట్‌లపై నడుస్తూ, ఆమె కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తూ కనిపిస్తున్నారు. తమన్నా (#TamannaahBhatia) విషయంలో ఇది అన్ బిలివబుల్ మేకోవర్ అనే చెప్పుకోవాలి. ఈ ఏజ్ హీరోయిన్లలో ఏ హీరోయిన్ కూడా ఇలా కనిపించింది లేదు. ఈ ఫస్ట్‌లుక్‌ అందరినీ ఆకట్టుకుంటూ.. శివరాత్రికి ఇది పర్ఫెక్ట్ ట్రీట్ అనేలా ఉంది. ఓదెల 2 గ్రామం చుట్టూ కేంద్రీకృతమై, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. (Tamannaah Bhatia As Shiva Shakthi in Odela 2)


హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ముఖ్య తారాగణం. VFX సినిమాలో టాప్ క్లాస్ ఉండబోతున్నాయని, ‘ఓదెల 2’ కోసం ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేయబోతున్నారని మేకర్స్ తెలుపుతున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉండే ఈ సినిమా నేషనల్ వైడ్‌గా విడుదల కానుందని మేకర్స్ తెలియజేశారు. కాగా.. సౌందర్ రాజన్ ఎస్ డీవోపీగా పని చేస్తుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. (Tamannaah Bhatia First Look From Odela 2)


ఇవి కూడా చదవండి:

====================

*Usha Parinayam: దుబాయ్‌లో అయింది.. ఇప్పుడు కాశ్మీర్‌లో..

*******************************

*Gaami Movie Review: విశ్వక్ సేన్ ‘గామి’ సినిమా ఎలా ఉందంటే...

****************************

*Gaami: ‘గామి’ ట్విట్టర్ టాక్.. విశ్వక్ సేన్‌కి హిట్ పడినట్టేనా?

*************************

Updated Date - Mar 08 , 2024 | 01:39 PM