Gaami: ‘గామి’ ట్విట్టర్ టాక్.. విశ్వక్ సేన్‌కి హిట్ పడినట్టేనా?

ABN , Publish Date - Mar 08 , 2024 | 10:33 AM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించారు. చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమా మహాశివరాత్రి స్పెషల్‌గా మార్చి 8న (నేడు) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల ఈ సినిమా షోస్ పడ్డాయి. ఈ సినిమా ట్విట్టర్ టాక్ బయటికి వచ్చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూల ప్రకారం ఈ సినిమా ఎలా ఉందంటే..

Gaami: ‘గామి’ ట్విట్టర్ టాక్.. విశ్వక్ సేన్‌కి హిట్ పడినట్టేనా?
Vishwak Sen in Gaami

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’ (Gaami). విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించారు. చాందినీ చౌదరి (Chandini Chowdary) కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఈ సినిమా మహాశివరాత్రి స్పెషల్‌గా మార్చి 8న (నేడు) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల ఈ సినిమా షోస్ పడ్డాయి. రిలీజ్‌కు ముందే కొన్ని పెయిడ్ ప్రీమియర్స్ కూడా నిర్వహించారు. వీటన్నింటికి మంచి స్పందన వచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన వారంతా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతూ.. సినిమాపై వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ‘గామి’ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే.. (Gaami Movie Twitter Talk)


హానెస్ట్ అటెంప్ట్.. నాకు మంచి సినిమా అనుభవాన్ని ఇచ్చింది. నేరేషన్ చాలా స్లోగా ఉంది కానీ.. యునిక్ స్టోరి. క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంది. విశ్వక్ సేన్ చాలా బాగా నటించారు. చాందిని చౌదరి ఇంకా ఇతర తారాగణం అంతా ఓకే. టెక్నికల్‌గా బ్రిలియంట్‌గా ఉందీ సినిమా. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, శివమ్ సాంగ్ ఈ సినిమాకు హైలెట్. మొత్తంగా అయితే.. ఒకసారి కచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ సినిమా ట్రై చేయవచ్చు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. (Gaami Twitter Review)


ఈ తరహాలో కథ చెప్పడం ఇదే ఫస్ట్ టైమ్. ఫ్రెష్ కాన్సెప్ట్. ఫస్టాఫ్ సంతృప్తికరంగానే ఉంది కానీ.. కొన్ని చోట్ల స్లోగా ఉంది. సెకండాఫ్ మాత్రం ప్రేక్షకుల్ని సీట్లలో కూర్చోనివ్వదు. సినిమాటోగ్రఫీ, లోకేషన్స్, విఎఫ్‌ఎక్స్, లైటింగ్ వంటి వన్నీ అద్భుతంగా ఉన్నాయి. థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్ కావద్దు అంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయం చెప్పుకొచ్చారు. (Gaami Movie Social Media Talk)


డిఫరెంట్ అటెంప్ట్.. చూడొచ్చు. విశ్వక్ సేన్ నటన, అదిరిపోయే విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్టోరీ.. ఈ సినిమాకు పాజిటివ్స్. కొన్ని సాగదీత సీన్లు, ఫస్టాఫ్‌ సినిమా నడిచే తీరు ఈ సినిమాకు నెగిటివ్స్ అంటూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇచ్చారు. (Gaami Twitter Review)

ఇలా.. సోషల్ మీడియాలో ప్రస్తుతానికైతే ఈ సినిమాకు హిట్ టాకే వినబడుతోంది. మరి అసలు ఈ సినిమా ఎలా ఉందో.. థియేటర్లలో ఈ సినిమా పరిస్థితి ఏంటో కాసేపట్లో వచ్చే రివ్యూలో తెలుసుకుందాం..


ఇవి కూడా చదవండి:

====================

*Allu Arjun and Sneha Reddy: 13వ పెళ్లి రోజు.. ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్

****************************

*Devara: తంగం.. జాన్వీ కపూర్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ వైరల్

**************************

Updated Date - Mar 08 , 2024 | 10:33 AM