Ayalaan: కోలీవుడ్‌లో సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా.. టాలీవుడ్‌లో ఎప్పుడంటే?

ABN , Publish Date - Jan 17 , 2024 | 05:06 PM

శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించగా.. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సంక్రాంతికి కోలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని జనవరి 26న టాలీవుడ్‌లో విడుదల చేయబోతున్నారు.

Ayalaan: కోలీవుడ్‌లో సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా.. టాలీవుడ్‌లో ఎప్పుడంటే?
Rakul Preet Singh and Sivakarthikeyan

శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’ (Ayalaan). రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఆర్. రవికుమార్ (R Ravikumar) దర్శకత్వం వహించారు. కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించగా.. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా కోలీవుడ్‌లో విడుదలైంది. తాజాగా ఈ సినిమా టాలీవుడ్‌లో ఎప్పుడు విడుదల కాబోతోందో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Ayalaan.jpg

అయలాన్ అంటే ఏలియన్. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే తొలిసారి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న తెలుగులో విడుదల చేయనున్నట్లు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్న గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలియజేసింది. తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అందుకున్న ‘వరుణ్ డాక్టర్’ సినిమా తర్వాత శివ కార్తికేయన్, కెజెఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. (Ayalaan Telugu Release Date Out)


SK-1.jpg

తమిళనాడులో ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. కేవలం నాలుగు రోజుల్లో రూ. 50 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఈ వారంలో వంద కోట్ల మార్క్‌కు చేరువ కానుంది. శివ కార్తికేయన్ నటనతో పాటు కామెడీ, సినిమా కాన్సెప్ట్ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సైన్స్ ఫిక్షన్ యూనివర్స్ కాన్సెప్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు కూడా సినిమాలో పుష్కలంగా ఉన్నాయని నిర్మాత కోటపాడి జె. రాజేష్ (Kotapadi J Rajesh) అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని సినిమా భారతీయ ప్రేక్షకులకు అందించాలని క్వాలిటీ విషయంలో మా టీమ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఎక్కువ విఎఫ్ఎక్స్ షాట్స్ ఉండటంతో, ఆ వర్క్ కంప్లీట్ కావడానికి సుమారు రెండేళ్లు పట్టింది. తమిళ ప్రేక్షకుల ఆదరణ చూశాక మా కష్టాన్ని మర్చిపోయాం. అంత సంతోషంగా ఉంది. ఏఆర్ రెహమాన్ గారి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చూపించాలని ఈ నెల 26న ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

====================

*Naa Saami Ranga: బ్రేకీవెన్‌కి దగ్గరగా.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

*****************************

*Ajay Gadu: ‘అజ‌య్ గాడు’ డైరెక్ట్‌గా ఓటీటీలోకి.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయండి

******************************

*HanuMan: ‘హను-మాన్’ ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం

***************************

*Kanguva: ‘కంగువ’ సెకండ్ లుక్.. సూర్య ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్

**************************

Updated Date - Jan 17 , 2024 | 05:06 PM