మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Thandel: ఇంటెన్స్, ప్యాషన్ నిండిన ఆహ్లాదకరమైన వాతావరణంలో టీమ్.. ఫొటోలు వైరల్

ABN, Publish Date - Mar 22 , 2024 | 02:15 PM

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న దేశభక్తి అంశాలతో కూడిన రస్టిక్ లవ్ స్టోరీ చిత్రం ‘తండేల్’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తాజాగా ‘తండేల్’ సెట్స్ నుండి కొన్ని షూట్ డైరీస్‌ని మేకర్స్ విడుదల చేశారు.

నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న దేశభక్తి అంశాలతో కూడిన రస్టిక్ లవ్ స్టోరీ చిత్రం ‘తండేల్’ (Thandel). ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పిస్తున్నారు.

తాజాగా ‘తండేల్’ సెట్స్ నుండి కొన్ని షూట్ డైరీస్‌ (Shoot Diaries)ని మేకర్స్ విడుదల చేశారు. ఇవి నటీనటులు, సాంకేతిక నిపుణుల మధ్య వైబ్, స్నేహపూర్వక అనుబంధాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

సెట్స్‌లో ఇంటెన్స్, పాషన్ నిండిన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. ఒక ఫోటోలో చందూ మొండేటి.. అల్లు అరవింద్‌కి ఒక సన్నివేశం గురించి వివరిస్తుండగా.. మరొక ఫోటో బన్నీ వాసు, నాగ చైతన్య, చందూ (Chandoo Mondeti) మధ్య సరదా సంభాషణను చూపుతుంది.

సాయిపల్లవి సరదాగా కనిపిస్తోన్న పిక్స్.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ డి-గ్లామరస్ అవతార్‌లలో పాత్రలకు అనుగుణంగా కనిపిస్తున్నారు.


దర్శకుడు చందూ మొండేటి కథను ప్రామాణికంగా చెప్పడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నటీనటుల గెటప్‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, యాసలతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్‌గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఈ ఫొటోలను చూస్తుంటే తెలుస్తోంది. త్వరలో కొన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లతో వస్తామని ఈ సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Rockstar Devi Sri Prasad) సంగీతం అందిస్తుండగా.. శామ్‌దత్ డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.


ఇవి కూడా చదవండి:

====================

*Allu Arjun: మరో రికార్డ్ బద్దలైంది.. ఐకాన్‌స్టార్‌ని ఆపతరమా..

************************

*Thalakona: కశ్మీర్ యాపిల్‌‌లా ఉండే అప్సరా రాణి.. కశ్మీర్ మిర్చి‌లా..

*********************

*Earthquake: జపాన్‌లో భూకంపం.. 28వ అంతస్తులో రాజమౌళి ఫ్యామిలీ..!

***********************

Updated Date - Mar 22 , 2024 | 02:15 PM