Seetha Kalyana Vaibhogame: ‘సీతా కళ్యాణ వైభోగమే’ ఫస్ట్ లుక్ ఇదే..

ABN , Publish Date - Apr 05 , 2024 | 08:28 PM

ఇప్పుడున్న ఓటీటీ, ఇతర కాంపిటేషన్స్ నేపథ్యంలో థియేట్రికల్ సినిమాలపై ఆసక్తిని క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా టైటిల్‌ నుండే ఆసక్తిని క్రియేట్ చేయడానికి మేకర్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచేశారు ‘సీతా కళ్యాణ వైభోగమే’ చిత్ర మేకర్స్. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Seetha Kalyana Vaibhogame: ‘సీతా కళ్యాణ వైభోగమే’ ఫస్ట్ లుక్ ఇదే..
Seetha Kalyana Vaibhogame Movie Still

ఇప్పుడున్న ఓటీటీ, ఇతర కాంపిటేషన్స్ నేపథ్యంలో థియేట్రికల్ సినిమాలపై ఆసక్తిని క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా టైటిల్‌ నుండే ఆసక్తిని క్రియేట్ చేయడానికి మేకర్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచేశారు ‘సీతా కళ్యాణ వైభోగమే’ (Seetha Kalyana Vaibhogame) చిత్ర మేకర్స్. ప్రస్తుతం దేశం అంతా జై శ్రీరామ్ అనే నినాదం మార్మోగిపోతోంది. ఈక్రమంలో వచ్చిన ‘హనుమాన్’ (Hanuman) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ‘సీతా కళ్యాణ వైభోగమే’ అంటూ రాబోతున్న ఈ సినిమా టైటిల్‌తోనే పాజిటివ్‌ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

*Devaki Nandana Vasudeva: అశోక్ గల్లా బర్త్‌డే.. సాంగ్ ప్రోమో విడుదల


సుమన్ తేజ్ (Suman Tej), గరీమ చౌహన్ (Gareema Chouhan) హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద (Satish Paramaveda) దర్శకత్వంలో రాచాల యుగంధర్ (Rachala Yugander) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గోవాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ నేతృత్వంలో దాదాపు 250 మంది డ్యాన్సర్లతో ఈ చిత్రంలోని ఒక పాటను మేకర్స్ చిత్రీకరించారు. ఇక తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌ను చూస్తుంటే.. లవ్ అండ్ యాక్షన్ మూవీని చూడబోతోన్నట్టుగా కనిపిస్తోంది.


Seetha.jpg

ప్రొడ్యూసర్ రాచాల యుగంధర్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 100 మంది ఫైటర్లతో చిత్రీకరించిన భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్‌గా నిలవనున్నాయని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలుపుతున్నారు. గగన్ విహారి విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, వెంకీ మంకీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతం, పరుశురామ్ కెమెరామెన్, డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. (Seetha Kalyana Vaibhogame First Look)


ఇవి కూడా చదవండి:

====================

*Kona Venkat: తారక్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా..

************************

*Paiyaa: 14 యేళ్ల తర్వాత ‘పయ్యా’ రీ రిలీజ్‌

*******************************

*Vijay Deverakonda: అలా చెప్పడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం తప్పు

******************************

Updated Date - Apr 05 , 2024 | 08:28 PM