Ramam Raghavam: తండ్రీ కొడుకుల ఎమోషనల్ జర్నీ ఇది.. ఆసక్తికరంగా టీజర్

ABN , Publish Date - Apr 27 , 2024 | 07:46 PM

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మాణంలో ధనరాజ్ కొరణాని దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్ని తాజాగా మేకర్స్ నిర్వహించారు. చిత్రయూనిట్‌తో పాటు ప్రముఖుల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Ramam Raghavam: తండ్రీ కొడుకుల ఎమోషనల్ జర్నీ ఇది.. ఆసక్తికరంగా టీజర్
Ramam Raghavam Teaser Launch Event

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మాణంలో ధనరాజ్ కొరణాని (Dhanraj Koranani) దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’ (Ramam Raghavam). సముద్రఖని (Samuthirakhani) ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్ని తాజాగా మేకర్స్ నిర్వహించారు. చిత్రయూనిట్‌తో పాటు ప్రముఖ దర్శకుడు బాలా, పాండిరాజ్, సముద్రఖని, నటులు బాబీ సింహా, తంబి రామయ్య, హాస్య నటుడు సూరి, నటుడు దీపక్, నటుడు హరీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు బాలా మాట్లాడుతూ.. రామం రాఘవం టీజర్ బాగుంది. ధనరాజ్ దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పిస్తాడు. ముఖ్యంగా సముద్రఖనిని మెచ్చుకోవాలి, ఇలాగే అతను చాలా మందికి సహాయం చేసి.. ప్రోత్సహించాలి. రామం రాఘవం పెద్ద విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నానని పేర్కొనగా.. నిర్మాత, పృథ్వి పోలవరపు మాట్లాడుతూ... సముద్రఖని అన్న సహాయం లేకుండా నేను ఈ సినిమా చేయలేను. ఈ సినిమా తీయడంలో ఖని అన్న చాలా ముఖ్యమైన వ్యక్తి. తండ్రీ కొడుకుల అనుబంధాల గురించి చెప్పే ఈ సినిమా బాగా వచ్చింది, జనాలకు నచ్చుతుందని తెలిపారు. (Ramam Raghavam Teaser Launched)


Dhanaraj.jpg

దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ.. రచయిత శివప్రసాద్ కథ ఇది. ఈ కథ గురించి ఖని అన్నకి చెప్పాను. కథను నువ్వే డైరెక్ట్ చేయాలి అని చెప్పాడు. నేను నటించిన చిత్రాలకు పనిచేసిన దర్శకుల నుండి నేను నేర్చుకున్న విషయాల ఆధారంగా నేనీ సినిమాకు దర్శకత్వం వహించాను. ఇప్పటి వరకు 100 చిత్రాల్లో నటించా. ఆ సినిమా దర్శకులు అందరూ నా గురువులే. వారు నేర్పిన పాఠాలతో ఈరోజు దర్శకుడిగా మారా. సముద్రఖని అన్న లేకుంటే ఈ సినిమా పూర్తయ్యేది కాదు, నేను దర్శకుడిని అయ్యే వాడిని కాను. అందరూ వాళ్ళ నాన్నతో కలిసి ఈ సినిమాని చూడాలని కోరారు.

సముద్రఖని (Samuthirakhani) మాట్లాడుతూ...  సంతోషకరమైన సమయం ఇది. నేను తండ్రిగా దాదాపు 10కి పైగా సినిమాల్లో నటించా. అవన్నీ విభిన్న కథలతో తెరకెక్కాయి. అలాంటి మరో కొత్త కథ ఇది. ధనరాజ్‌కి తల్లిదండ్రులు లేరు. స్వతహాగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. మంచి కథ ఇది.. అందుకు తగ్గ దర్శకుడు ఉండాలని అనుకున్నా. ధనరాజ్ పై నాకు పెద్ద నమ్మకం ఉంది. అందుకే, అతన్నే దర్శకత్వం చేయమని చెప్పా. దర్శకుడిగా అతను పెద్ద విజయాన్ని అందుకుంటాడు. ప్రతి తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధాన్ని చాటి చెప్పే చిత్రమిది. నిర్మాతను నేనెప్పుడూ కలవలేదు. చిత్రీకరణ సమయంలో మొదటిసారి చూశాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు బాబీ సింహా, తంబి రామయ్య, సూరి, మోక్ష వంటి వారు ప్రసంగించారు. (Ramam Raghavam Teaser)

Updated Date - Apr 27 , 2024 | 07:46 PM