Samudrudu: ‘సముద్రుడు’ ఫస్ట్ లుక్ వదిలిన కేటీఆర్

ABN , Publish Date - Feb 08 , 2024 | 04:44 PM

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సముద్రుడు’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను గురువారం తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Samudrudu: ‘సముద్రుడు’ ఫస్ట్ లుక్ వదిలిన కేటీఆర్
Samudrudu Movie Teaser Launch Event

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సముద్రుడు’ (Samudrudu). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను గురువారం తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందిన సినిమా ఇది. మా చిత్రంలో పెద్ద ఆర్టిస్టులు అందరూ నటించారు. మా చిత్ర ఫస్ట్ లుక్ తెలంగాణ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరుపుకోవడం.. అలాగే, ఒక సోషియో ఎలిమెంట్‌ని కమర్షియల్‌గా మలిచి సినిమా రూపొందించడం అభినందనీయమని ఆయన అనడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. (KTR Launches Samudrudu Teaser)


KTR-2.jpg

హీరో రమాకాంత్ మాట్లాడుతూ.. మా ‘సముద్రుడు’ చిత్ర ఫస్ట్ లుక్‌ను కేటీఆర్‌గారు విడుదల చేయడం చాలా సంతోషం‌గా వుంది. ఈ సందర్భo‌గా ఆయనకు మా టీమ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్ని కమర్షియల్ హంగులతో దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. మే 3న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూసి మమ్మలని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*ప్రకటనలతో సరిపెట్టొద్దు.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లండి: విజయ్‌కి ఈ సూచన ఎవరిచ్చారో తెలుసా..?

****************************

*Lal Salaam Trailer: ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే.. తలైవా డైలాగ్ వైరల్

*************************

*Vishal: పొలిటికల్ ఎంట్రీ, నూతన పార్టీ వార్తలపై విశాల్ ఏమన్నారంటే..

***********************

*Kiran Abbavaram: కొత్త దర్శకుడితో కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్

**************************

Updated Date - Feb 08 , 2024 | 05:50 PM