Kiran Abbavaram: కొత్త దర్శకుడితో కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:19 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఈ మధ్య కాస్త తగ్గింది కానీ.. ఈ పేరు ఒక సంవత్సరం క్రితం బాగా వైరల్ అయింది. టాలీవుడ్‌కి చెందిన అగ్ర నిర్మాణ సంస్థలలో సినిమాలు చేస్తూ.. ఈ కుర్ర హీరో అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఆయన ఓ నూతన దర్శకుడితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘దిల్ రూబ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.

Kiran Abbavaram: కొత్త దర్శకుడితో కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఫిక్స్
Kiran Abbavaram

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. ఈ మధ్య కాస్త తగ్గింది కానీ.. ఈ పేరు ఒక సంవత్సరం క్రితం బాగా వైరల్ అయింది. టాలీవుడ్‌కి చెందిన అగ్ర నిర్మాణ సంస్థలలో సినిమాలు చేస్తూ.. ఈ కుర్ర హీరో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం, వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి చిత్రాలతో సక్సెస్‌ను సైతం సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం.. ఈ మధ్య కాలంలో అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. రీసెంట్‌గా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann) సినిమా ఆయనకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. అయితేనేం.. తగ్గేదేలే అన్నట్లుగా ఇప్పుడో నూతన దర్శకుడితో.. బంపర్ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

డెబ్యూ దర్శకుడితో ఆయన చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘దిల్ రూబ’ (Dil Ruba) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్ (Ruksar Dhillon) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ ఆడియో కంపెనీ సరేగమా నిర్మిస్తుండటం విశేషం.


Kiran.jpg

అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సమ్మర్‌కే ఈ ‘దిల్ రూబ’‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనేలా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో మరో యూనిక్ కాన్సెప్ట్‌తో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని మూవీ టీమ్ చెబుతోంది. త్వరలో ‘దిల్ రూబ’‌ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు. ప్రస్తుతం ‘దిల్ రూబ’ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. (Kiran Abbavaram Next Project Dil Ruba)


ఇవి కూడా చదవండి:

====================

*RRR: జక్కన్నపై మరోసారి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ప్రశంసలు

******************************

*Varun Tej: ఫస్ట్ లావణ్య.. తర్వాత ఆ హీరోయిన్ అంటే ఇష్టం

**************************

*Rashmika Mandanna: ఏం చేయను.. మీడియా అలా రాస్తోందని చెబుతా..

******************************

*Kavya Thapar: గోపీచంద్, శ్రీను వైట్ల కాంబో మూవీ టైటిల్ లీక్ చేసిన ‘ఈగల్’ భామ

************************

Updated Date - Feb 07 , 2024 | 04:19 PM