Mercy Killing: ఆర్టికల్ 21 ఆధారంగా.. ప్రతి మహిళ కచ్చితంగా చూడాల్సిన చిత్రం

ABN , Publish Date - Mar 30 , 2024 | 05:38 PM

సాయి సిద్ధార్థ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కిన చిత్రం ‘మెర్సి కిల్లింగ్’. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పణలో సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.

Mercy Killing: ఆర్టికల్ 21 ఆధారంగా.. ప్రతి మహిళ కచ్చితంగా చూడాల్సిన చిత్రం
Mercy Killing Pre Release Event

సాయి సిద్ధార్థ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కిన చిత్రం ‘మెర్సి కిల్లింగ్’ (Mercy Killing). సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పణలో సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల నిర్మించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, కోన వెంకట్, పూరి ఆకాష్, యాంకర్ రవి తదితరులు పాల్గొన్నారు. (Mercy Killing Pre Release Event)

ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ (Sai Kumar) మాట్లాడుతూ... ‘మెర్సీ కిల్లింగ్’ అనే సినిమా స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. స్వేచ్ఛ పాత్రలో హారిక బాగా నటించింది. దర్శకుడు సూరపల్లి వెంకటరమణ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. పార్వతీశం, ఐశ్వర్య పోటీ పడి మరి నటించారు. నేను ఈ సినిమాలో మరో మంచి రోల్‌లో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ప్రతి మహిళ చూడవలసిన సినిమా ‘మెర్సి కిల్లింగ్’. సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలు ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. తప్పకుండా ఒక మంచి చిత్రంగా ఈ సినిమా నిలబడుతుందని తెలిపారు.


Parvateesam.jpg

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మెర్సీ కిల్లింగ్’. స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని, అందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని.. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం కష్టపడి పనిచేశారని దర్శకుడు వెంకటరమణ ఎస్ (Soorapalli VenkatRamana) తెలిపారు. సినిమా బాగుందని ప్రివ్యూ చూసిన అందరూ అంటుంటే సంతోషంగా ఉందని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా ఈ సినిమా విజయం సాధించి, టీమ్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ వంటి వారు ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్రానికి జి. అమర్ సినిమాటోగ్రఫీ, ఎం.ఎల్.రాజా సంగీత బాధ్యతలను నిర్వర్తించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Family Star: విజయ్ ఈ సినిమాతో రౌడీ కాస్తా.. ‘ఫ్యామిలీ స్టార్’ అవుతాడు..

***********************

*Adiparvam: ప్రచార చిత్రంతోనే ఫైర్ చూపించిన మంచు లక్ష్మీ

***********************

*Kaliyugam Pattanamlo: షాక్.. ‘కలియుగం పట్టణంలో’ ఆపేశారు..

************************

Updated Date - Mar 30 , 2024 | 05:38 PM