Laggam: ‘లగ్గం’ ఉగాది స్పెషల్ పోస్టర్ విడుదల..

ABN , Publish Date - Apr 09 , 2024 | 05:10 PM

సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన-దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ పెళ్లిలో ఉండే సంబురాన్ని, విందుని, చిందుని ఈ సినిమాలో కన్నుల విందుగా చూపించబోతున్నారు. తాజాగా తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని.. చిత్ర షూటింగ్ అప్‌డేట్‌తో పాటు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేశారు.

Laggam: ‘లగ్గం’ ఉగాది స్పెషల్ పోస్టర్ విడుదల..
Laggam Movie Team

సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’ (Laggam). ఈ సినిమాకు రమేశ్ చెప్పాల (Ramesh Cheppala) రచన-దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ పెళ్లిలో ఉండే సంబురాన్ని, విందుని, చిందుని ఈ సినిమాలో కన్నుల విందుగా చూపించబోతున్నారు. తాజాగా తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని.. చిత్ర షూటింగ్ అప్‌డేట్‌తో పాటు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ (Laggam Ugadi Wishes Poster)ని విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే పండగ వాతావరణం కనిపిస్తోంది. ఈ పండుగకి పర్ఫెక్ట్ పోస్టర్ అనేలా మేకర్స్ డిజైన్ చేశారు. ఫెస్టివల్ స్పెషల్‌గా చిత్రయూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది.


Laggam-Movie.jpg

ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ చెప్పాల (Director Ramesh Cheppala) మాట్లాడుతూ.. ‘‘ఇది కల్చరర్ ఫ్యామిలీ డ్రామా. సినిమా విడుదల తర్వాత ప్రతి ఒక్కరు ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటారు, కొత్త అనుభవాన్ని కళ్ల ముందు ఉంచే చిత్రమిది. కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని నమ్మకంగా చెప్పగలం. ప్రస్తుతం ఈ సినిమా కామారెడ్డి, జనగామ, బీబీపేట ఇస్సానగర్ ప్రాంతాల్లో.. పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో వేసిన సెట్స్ మధ్య 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే మూడు సాంగ్స్ కూడా షూట్ చేశాము. ఏప్రిల్ 11 నుండి నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని తెలిపారు. కాగా.. సీనియర్ ఆర్టిస్ట్‌లు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), రోహిణి (Rohini), ఎల్.బి శ్రీరామ్ (LB Sriram) తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

****************************

*Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!

***********************

Updated Date - Apr 09 , 2024 | 05:10 PM